ఆంధ్రప్రదేశ్
పెరిగిన వరద ఉధృతితో ఆర్టిపిపికి రాకపోకలు బంద్
ఏపీ టుడే న్యూస్,
కడప జిల్లా, ప్రొద్దుటూరు
గండికోట ప్రాజెక్టు నుండి మైలవరం జలాశయం ద్వారా దాదాపు 12 వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేయటంతో, ప్రొద్దుటూరు పరివాహక ప్రాంతంలోని పెన్నా నది జలకల సంతరించుకుంది. బుధవారం సాయంత్రం నది పరివాహక ప్రాంతాలలోని పట్టణాలను గ్రామాలను అప్రమత్తం చేసిన మైలవరం జలాశయ అధికారులు, క్రమంగా మైలవరానికి వరద ఉధృతి పెరుగుతున్న కారణంగా దాదాపు 12 వేల క్యూసెక్కుల నీటిని పెన్నా నదికి విడుదల చేయనున్నారు. క్రమంగా ప్రొద్దుటూరు పెన్నా నది నందు వరద ప్రవాహం పెరుగుతోంది. పెన్నా నది పరివాహక ప్రాంతం దగ్గరికి ప్రజలు వెళ్లకుండా అధికారులు తగు సూచనలు సలహాలు చేశారు. ఇందులో భాగంగా రాత్రి నుండి పోలీసులను సంబంధిత విఆర్వోలను కాపలాగా ఉంచారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తతతో మెలగాలని తగు జాగ్రత్తలు తీసుకొని ప్రభుత్వ హెచ్చరికలను బేకాతరు చేయకుండా పోలీసులు రెవెన్యూ సిబ్బందికి సహకరించాలని కోరారు. ఇదిలా ఉండగా ప్రొద్దుటూరు రామేశ్వరం నుండి కల్లమల్ల ఆర్టిపిపి కి వెళ్ళు మట్టి రోడ్డు పాక్షికంగా వరద ఉధృతికి కొట్టుకొని పోగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గురువారం రాత్రికి వరద ఉధృతి పెరిగి పెన్నాకి మరిన్ని వేల క్యూసెక్కుల మైలవరం జలాశయ నీరు చేరనుంది.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 68140