Connect with us

ఆంధ్రప్రదేశ్

ఉపాధి హామీ నిర్దేశిత పనులను పూర్తి చేయండి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా.

Published

on

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిర్దేశించిన పనులను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఎంపీడీవోలు, ఎపిడిలు, క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు.
గురువారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో ఉపాధి హామీ పథకం కింద నిర్ధేశించిన లేబర్ బడ్జెట్, వంద రోజుల పనిదినాల కల్పన, హార్టికల్చర్, అవెన్యూ ప్లాంటేషన్ పనులు, సంస్థాగత ప్లాంటేషన్ పనులు, బ్లాక్ ప్లాంటేషన్ పనులు, ఫారం పాండ్స్, రూఫ్ టాప్ వాటర్ హార్వెస్టింగ్ పనులు, పశుసంపద షెడ్లు, ట్రెంచ్‌ పనుల ప్రగతి లక్ష్యాలపై జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా క్లస్టర్ల వారీగా సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కింద నిర్దేశించిన పనులను గడువులోగా పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎంపీడీవోలు, ఎపిడిలు, క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు. జిల్లాలో 55 ఫారం పాండ్ల త్రవ్వకానికి గాను 42 పూర్తి చేశారని పెండింగ్ లో ఉన్న కొత్తపల్లి, బనగానపల్లి, ఉయ్యాలవాడ, మిడుతూరు మండలాల్లో మిగిలివున్న లక్ష్యాన్ని పూర్తి చేయాలని సూచించారు. 427 పశుసంపద షెడ్లకు కేటాయించిన లక్ష్యానికి గాను 32 షెడ్లు పూర్తి చేశారని పాములపాడు, బనగానపల్లి, గడివేముల మండలాల్లో పెండింగ్ లో ఉన్న పశు సంపద షెడ్లను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. లేబర్ బడ్జెట్ మొబలైజేషన్ లో కొత్తపల్లి, ప్యాపిలి, డోన్, రుద్రవరం, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, ఔక్, కోవెలకుంట్ల, గోస్పాడు, మిడుతూరు తదితర మండలాలు లక్ష్యసాధనలో వెనుకబడి వున్నాయని నిర్దేశిత గడువులోగా ప్రగతి సాధించేందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ప్లాంటేషన్ కు సంబంధించి వెలుగోడు, ప్యాపిలి, డోన్, బేతంచర్ల, సంజామల కొలిమిగుండ్ల, సిరివెళ్ల మండలాల్లో లక్ష్యాన్ని చేరుకోలేదని ఈ వారంలోగా ఈ వారంలో ప్రగతి సాధించేందుకు కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఉపాధి ఎపీడీలు ప్రతిరోజు తనిఖీలు నిర్వహిస్తూ పనుల వేగవంతానికి కృషి చేయాలన్నారు.

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580498
Total Users : 48182