ఆంధ్రప్రదేశ్
100 రోజుల పాలన సూపర్ సక్సన్. టిడిపి సీనియర్ బీసీ నేత పి పి లింగమయ్య.
ఏపీ టుడే న్యూస్:- ఉల్లి గుర్రప్ప – నంద్యాల జిల్లా
శిరివెళ్ల :- మండల పరిధిలోని ఆయా గ్రామాలతో పాటు శిరివెళ్ల మేజర్ పంచాయతీ గ్రామంలో కొనసాగుతున్న ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం పై తెలుగుదేశం పార్టీ సీనియర్ బీసీ నేత పసుల పెద్ద లింగమయ్య కూటమి ప్రభుత్వం 100 శాతం సక్సెస్ సాధించిందని అభివర్ణించారు.
ఆళ్ళగడ్డ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎం ల్ ఏ భూమ అఖిల ప్రియ గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఉత్సాహభరితంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటున్నారని పిపి లింగమయ్య పేర్కొన్నారు.
ఇంటింటికి తిరిగి వెళ్లి స్టిక్కర్లు అతికించి, కరపత్రాలను పంచుతూ తెలుగుదేశం పార్టీ వచ్చి 100 రోజులు పాలన పూర్తి అయినా సందర్భంగా,గత ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసి రైతులకు భూమిపైన సర్వహక్కులు కల్పించిందన్నారం
పెంచిన పెన్షన్ సకాలంలో లబ్ధిదారులకు అందజేయడం పట్ల పెన్షన్ దారులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు.
విజయవాడ వరదల సమయంలో పగలు రాత్రి అనే తేడా లేకుండా 74 సంవత్సరాల వయసును సైతం లెక్కచేయకుండా యువకుడిలా పనిచేసి ప్రాణ నష్టం జరగకుండా కాపాడారనీ పి పీ లింగమయ్య అన్నారు.
పేదల ఆకలి తీర్చాలన్న సదుద్దేశంతో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి 5 రూపాయలకు రైతులకు, కార్మికులకు, పేదలకు, అన్నం పెడుతున్నారనీ స్పష్టం చేశారు.
. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం నారా చంద్రబాబు నాయుడు గారి సారధ్యంలో స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యంగా కృషి చేయబోతున్నారని టీడీపి సీనియర్ బీసీ నేత పిపి లింగమయ్య పేర్కొన్నారు
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 68031