ఆంధ్రప్రదేశ్
భగత్ సింగ్ భావితరాలకు ఆదర్శం….. ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్
ఏపీ టుడే న్యూస్ మంత్రాలయం రిపోర్టర్:

భగత్ సింగ్ ఆశయాలను కొనసాగిస్తాం…. ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి థామస్
భగత్ సింగ్ బ్రిటీష్ సామ్రాజ్య వాదుల గుండెల్లో సింహస్వప్న మని , భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత కృషి చేయాలని AISF-AIYF నాయకులు అన్నారు.భగత్ సింగ్ 117 వ జయంతి సందర్భంగా AISF-AIYF ఆధ్వర్యంలో మంత్రాలయం లోని స్ధానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాధికారి మొహినుద్దిన్ కళాశాల ప్రిన్సిపల్ రమేష్ హాజరై భగత్ సింగ్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాలర్పించారు.
ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి థామస్ మాట్లాడుతూ….. ఆయన పేరు వింటేనే రోమాలు నిక్కబొడుస్తాయి, ఆయనను చూస్తే బ్రిటీష్ అధికారులు సైతం తమకు తెలియకుండానే శేల్యూట్ చేస్తారు, పన్నెండేళ్లకే భారతజాతి విముక్తి కోసం కంకణం కట్టాడు, పద్నాలుగేళ్లకే భారత స్వాతంత్ర్య సంగ్రామంలో అడుగుపెట్టాడు,ఇరవైమూడేళ్లకే తన ప్రాణం బలిదానం చేసి యువతరంలో జ్వాలను రగిలించిన యోధుడు భగత్ సింగ్ అని కొనియాడారు.భగత్ సింగ్ అంటే ధైర్యానికి ప్రతీక. దేశభక్తికి ప్రతిరూపం. ధీరత్వానికి మారుపేరు. నవతరానికి ఒక స్ఫూర్తి. భయమెరుగని భారతీయుడు. అంతులేని ధైర్యానికి కొలమానం. ఉరితాడుతో ఉయ్యాలలూగిన భారత తేజం. ఆ విప్లవవీరుడి పేరు లేకుండా భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రే లేదు.
1907 సెప్టెంబర్ 28న పాకిస్తాన్లోని లాయల్పూర్ జిల్లా బంగాలో కిషన్ సింగ్, విద్యావతి దంపతులకు భగత్సింగ్ జన్మించారు.చిన్ననాటి నుంచే నరనరాల్లో దేశభక్తిని ఇనుమడింపచేసుకున్నాడు భగత్ సింగ్.
అందుకే దశాబ్దాలు గడిచినా ఆ విప్లవవీరుడి త్యాగం ఇంకా సజీవంగానే ఉంది.దేశవిదేశాల్లో ఎన్నో పోరాటాలకు ఆజ్యం పోసింది.కోట్లాదిమందిలో తెగువ నింపింది భగత్ సింగ్.
ఉరకలేస్తున్న యవ్వనాన్ని దేశానికి అంకితం చేశాడు, పరవళ్లు తొక్కే పౌరుషాన్ని స్వాతంత్ర్యం సాధించుకునేందుకు పణంగా పెట్టాడు,12 ఏళ్ల వయసులోనే జలియన్ వాలాబాగ్ దారుణాలను చూసి భగత్ సింగ్ రగిలిపోయాడు. సామ్రాజ్యవాద బ్రిటీష్ పాలకులపై కసి పెంచుకున్నాడు. 14 ఏళ్ల ప్రాయంలోనే మహాత్ముడి పిలుపుతో సహాయ నిరాకరణ ఉద్యమంలోకి దూకాడు. గాంధీ అకస్మాత్తుగా సహాయనిరాకరణ ఉద్యమాన్ని నిలిపేయడం భగత్ సింగ్ కు నచ్చలేదు. అందుకే తన పంథాలోనే పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాడు. తనకు నచ్చే వేదికలను వెదుక్కున్నాడు. 1926లో నవజవాన్ భారత్ సభ అనే మిలిటెంట్ సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ అనే సంస్థను స్థాపించి స్వాతంత్య పోరాటాన్ని కొనసాగించాడు.1928లో సైమన్ కమిషన్ వచ్చినప్పుడు పోలీసుల దాడిలో లాలాలజపతిరాయ్ చనిపోవటంతో భగత్ సింగ్ నెత్తురు ఉడికిపోయింది. సహచరులతో కలిసి జాతీయ అసెంబ్లీలో బాంబులు వేయాలన్న ఆలోచన చేశారు. విజిటర్స్ గ్యాలరీ నుండి బాంబులు వేసి ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ కరపత్రాలు వెదజల్లారు.బ్రిటీష్ హై కమిషనర్ సాండర్స్ ను కాల్చి చంపాడనే అభియోగం కింద భగత్సింగ్తో పాటు రాజ్గురు, సుఖ్దేవ్లను 1931 మార్చి 23న లాహోర్లో ఉరి తీశారు.
అనంతరం అత్యంత పాశవికంగా భగత్ సింగ్ మృతదేహాన్ని తెగ నరికి దహనం చేశారు. కానీ భగత్ సింగ్ ఎవరిని చంపలేదని సాక్షాత్తు పాకిస్ధాన్ పోలీస్ శాఖ లాహోర్ న్యాయస్ధానానికి తెలిపింది. దీన్ని బట్టి చూస్తే పోరాటయోధుడిని కావాలనే బ్రిటిష్ ప్రభుత్వం హత్య చేసిందని తెలుస్తోంది. ఉరిని తప్పించుకునే అవకాశం ఉన్నా తన ఉరి దేశ స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని పెంచుతుందని చావును ఆహ్వానించాడు.
చరిత్ర… వీరుల్ని, విప్లవ ధీరుల్ని పుట్టిస్తుంది. అలాంటి పోరాట యోధుడే భగత్ సింగ్. భరతమాత సంకెళ్లను తెంచేందుకు, ఉరితాడునే పూలమాలగా మెడలో వేసుకున్న ధైర్యశాలి అని ఈ సందర్భంగా వారన్నారు.
ఈ కార్యక్రమం లో ఏఐఎస్ఎఫ్ మండల నాయకులు అరున్ ఆచారి, రాజు,వీరేష్,నవిన్, మహిళా కో కన్వీనర్ శిరిష, మహాలక్ష్మి మల్లికా,తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 68149