ఆంధ్రప్రదేశ్
ఆలూరు ప్రాంత సమస్యల పరిష్కారానికి సీఎంను కలుస్తాం.. జర్నలిస్టుల శ్రమ వృథా కాకూడదు.. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ
ఏపీ టుడేన్యూస్,
పత్తికొండ/ఆలూరు:

ఆలూరు ప్రాంత అభివృద్ధికై ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులు చేసిన ప్రయత్నం అభినందనీయమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. శనివారం ఆలూరు ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఆలూరు టీడీపీ ఇంచార్జి వీరభద్రగౌడ, సీపీఐ జిల్లా కార్యదర్శి గిద్దయ్యాలతో కలసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆలూరు అభివృద్ధిలో మీడియా,ప్రజా ప్రతినిధులు,అధికార్ల పాత్ర పై ఈనెల 22న నిర్వహించిన సెమినార్లో పలు సమస్యలపై ప్రస్తావించడం ద్వారా సమస్యలు వెలుగులోకి వచ్చాయన్నారు. ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంతం వెనుకబాటుకు గురి అవుతుందని అన్నారు. నియోజవర్గంలో సాగు నీటి వనరులు లేకపోవడమే ప్రధాన కారణం అన్నారు. త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు రహదారులు అస్తవ్యస్తంగా మారిపోయాయని అన్నారు. వేదవతి నగరడో ణ ప్రాజెక్టులు పూర్తి అవుతే సాగు త్రాగు నీటి సమస్య పరిష్కారం అవుతుందన్నారు. ఇందుకోసం ఆలూరు ప్రాంత ప్రజాప్రతినిధులు, తరుణ్ పార్లమెంట్ అభ్యర్థి నాగరాజు తో కలిసి ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి జర్నలిస్టులు నిర్వహించిన సెమినార్ వృధా కాకుండా అందులో ఉన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లి పరిష్కార మార్గానికి కృషి చేస్తామన్నారు. అనంతరం ఏపీడబ్ల్యూజే జిల్లా తాలూక నాయకులు స్వరూప్,శ్రీధర్,సురేష్,చంద్రబాబు,మండల కార్యదర్శి వీరేష్,తాలూక నాయకులు రాజేష్, గోపాల్,దానియేలు, భీమా,రాం మోహన్,రంగస్వామి,నారాయణ,వీరే ష్,ఏర్రి స్వామి,ఖాదర్,సాయి
ఆయనను సన్మానించి మెమొంటో అందజేశారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 68108