Connect with us

ఆంధ్రప్రదేశ్

ఎటువంటి లోటుపాట్లు లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల పర్యటనను విజయవంతం చేయండి – జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా

Published

on

ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో

ఎటువంటి లోటుపాట్లు లేకుండా అధికారులందరూ సమన్వయంతో కృషి చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు..

కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పుచ్చకాయలమడ గ్రామంలో అక్టోబర్ 1 వ తేదిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు పర్యటించనున్న సందర్భంగా జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తో కలిసి హెలిప్యాడ్, సభా ప్రాంగణం ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పరిశీలించారు.

తొలుత పుచ్చకాయలమడ గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ను కలెక్టర్ పరిశీలించారు. హెలిప్యాడ్ లో భద్రత పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల పై కలెక్టర్ ఎస్పీ తో చర్చించారు. అనంతరం లబ్ధిదారుల గృహాలను, శిలాఫలకం, సభ వేదిక ప్రాంగణాలను కలెక్టర్ పరిశీలించారు. సభ వేదిక వద్ద చేయవలసిన ఏర్పాట్ల పై కలెక్టర్ అధికారులకు తగు సూచనలు చేశారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా త్రాగునీరు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. గ్రామం అంతా శుభ్రంగా ఉండే విధంగా చూడాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పబ్లిక్ అడ్రస్ సిస్టం, ఎల్ఈడి స్క్రీన్, లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాట్లలో ఎటువంటి సమస్య ఉండకూడదని కలెక్టర్ అధికారులను ఆదేశించారు..

జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల పర్యటన సందర్భంగా ఓర్వకల్లు ఎయిర్పోర్ట్, హెలిప్యాడ్, సభా ప్రాంగణం వద్ద పటిష్ఠమైన బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు.

కార్యక్రమంలో ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, పత్తికొండ ఆర్డీఓ రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు..

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580464
Total Users : 48148