ఆంధ్రప్రదేశ్
స్వర్ణాంధ్ర @2047 క్విజ్ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు జ్ఞాపికలు.జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.

స్వర్ణాంధ్ర @2047 విజన్ డాక్యుమెంట్ పై పాఠశాల విద్యార్థుల ఉపన్యాస భావాలు అందరికీ స్ఫూర్తిదాయకం కావాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని సెంటనరీ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా స్వర్ణాంధ్ర @2047 క్విజ్ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు కలెక్టర్, జెసిలు జ్ఞాపికలు అందచేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర@2047 దార్శనిక పత్ర రూపకల్పనపై పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలను నిర్వహించామన్నారు. ప్రథమ, ద్వితీయ స్థానాలలో వక్తృత్వ పోటీలలో గెలుపొందిన విద్యార్థులు స్వర్ణాంధ్ర@2047 విజన్ డాక్యుమెంట్ పై వ్యక్తపరచిన ఉపన్యాస భావాలు అందరికీ స్ఫూర్తిదాయకం కావాలని కలెక్టర్ తెలిపారు. ప్రణాళికలో వివిధ వివిధ అభివృద్ధి అంశాలను జోడిస్తూ ప్రసంగించిన తీరు అందరిని ఆకట్టుకుందన్నారు. పోటీలలో పాల్గొని ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో గెలుపొందిన పాఠశాల విద్యార్థులకు ప్రశంసా పత్రాలతో పాటు జ్ఞాపికలు అందజేసారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 68103