Connect with us

ఆంధ్రప్రదేశ్

పత్తికొండ మండలం పూచ్చకాయలమడలో పింఛన్ల పంపిణీ చేసిన సీఎం

Published

on

ఏపీ టుడే న్యూస్,పత్తికొండ:

పేదల సంక్షేమానికి పెద్దపీట
హామీల అమలుకు టీడీపీ కట్టుబడి ఉంది
రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తాం
సీఎం చంద్రబాబు నాయుడు …

గత వైసీపీ పాలన మొత్తం రాష్ట్రంలో విధ్వంస పరిపాలన కొనసాగింది అని రాష్ట్రం పూర్తిగా వెనుకబడి పోయిందని పేదల సంక్షేమానికి పెద్దపీట హామీల అమలుకు టీడీపీ కట్టుబడి ఉంది
రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తాం అని
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మంగళవారం ఆయనపత్తికొండ మండలం పుచ్చకాయలమాడలో నిర్వహించిన గ్రామసభలో సీఎం ప్రసంగించారు.ముందుగా గ్రామంలో ఉన్న కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలోని ఇళ్లలోకి వెళ్లి తేనీరు సేవించి వారి బాగోగులు తెలుసుకున్నారు.

పుచ్చకాలమాడకు మహర్దశ…

గ్రామంలో 48 నూతన పెన్షన్లు పంపిణీ చేశారు.203 ఇళ్లు మంజూరు చేశారు.నూతన రేషన్ కార్డులు,జాబ్ కార్డులు,125 ఇళ్లకు కుళాయి కనెక్షన్లు,105 ఇళ్లకు మరుగుదొడ్లు మంజూరు చేశారు.
గ్రామంలో మురుగునీటి పారుదలకు 1.7 కిమీ డ్రైనేజీ కాలువ,10.7 కిమీ పొడవు సీసీ రోడ్డు,22 మినీ గోకులాలు మంజూరు చేశారు.
పుచ్చకాయలమడ గ్రామంలో రూ.2.83 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సంబంధించిన పైలాన్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. జాతీయ ఉపాధి హామీకింద 1 కోటి 38 లక్షల రూపాయలతో అంతర్గత సిసి రోడ్లు(16 పనులు) నిర్మాణం ,
జాతీయ ఉపాధిహామీ పథకం
కింద 20 లక్షల రూపాయలతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రహారీ గోడ నిర్మాణం,ఎంపీ ల్యాడ్స్ కింద 30 లక్షల రూపాయలతో కమ్యూనిటీ హాలు నిర్మాణం,
87 లక్షల 75 వేల రూపాయలతో క్యాటిల్ షెడ్, కమ్యూనిటీ వాటర్ హార్వెస్టింగ్ ఫార్మ్ ఫండ్స్, పూడిక తీత, సరిహద్దు గుంతల నిర్మాణం ,
8 లక్షల రూపాయలతో 11 కె.వి.విద్యుత్ లైన్ మార్పిడి పనులకు హామీ ఇచ్చారు.
మద్దికెర నుండి హోసూరు మీదుగా పత్తికొండకు రోడ్డు వేయుటకు హామీ ఇచ్చారు.
కర్నూలు నుండి బళ్ళారి వరకు 4 లైన్ల హైవే రోడ్డ నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి పనులు మొదలు పెట్టేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

‘వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌కు శ్రీకారం…

ఉద్యోగులకు పని ఒత్తిడి తగ్గించేందుకు వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌కు శ్రీకారం చుట్టాలనేది నా ఆలోచన అని గ్రామాల్లో వర్క్‌ స్టేషన్లు ఏర్పాటు చేయడం ద్వారా సొంతూరులోనే ఉండి ఉద్యోగం చేసుకోవచ్చు అన్నారు.
గత ప్రభుత్వంలో సీఎం మీటింగ్‌ అంటే పరదాలు కట్టేవారు అని చెట్లు కొట్టేసే వారు గతంలో సీఎం మీటింగ్‌ అంటే ప్రజలకు నరకం కనిపించేది అన్నారు.కూటమి ప్రభుత్వం వచ్చాక పింఛను రూ.4వేలకు పెంచాము ఒకటో తేదీన అధికారులు మీ ఇంటికొచ్చి పింఛను ఇస్తున్నారు అని గుర్తుచేశారు. పింఛన్ల పంపిణీ శాశ్వతంగా కొనసాగిస్తాం అన్నారు. ఒకప్పుడు ఉద్యోగులకు జీతాలు సరిగా వచ్చేవి కావు అని ఇప్పుడు ఉద్యోగులకు నెలనెలా జీతాలు, పింఛన్లు ఇస్తున్నాం జీతాల గురించి ఎవరూ ఆందోళన చెందవద్దు అన్నారు. ఎన్నికల్లో ప్రజలు అంత ఏకతాటిపై నిలబడి ఎంతో చైతన్యంతో కూటమికి ఓట్లు వేశారు అన్నారు. జగన్‌ వెళ్తూ వెళ్తూ ఖజానా ఖాళీ చేసి వెళ్లారు అని విమర్శించారు. మీరు ఎక్కువ మంది కూటమి ఎంపీలను గెలిపించి మంచి పనిచేశారు అని హర్షం వ్యక్తం చేశారు.

గత ఐదేళ్లలో ఒక్క ఎకరాకు నీరివ్వలేదు..

గత వైసీపీ ఐదేళ్ల ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టును విధ్వంసం చేసి రాష్ట్రంలో ఒక్క సాగునీటి ప్రాజెక్టులు కూడా మొదలు పెట్టలేదని విమర్శించారు.
వైకాపా ప్రభుత్వం చేసిన విధ్వంసం అంతాఇంతా కాదు. పైసా ఖర్చు లేకుండా రాజముద్రతో పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇచ్చే బాధ్యత మాది అన్నారు. ఇప్పటికే ల్యాండ్ టైటిలింగ్‌ యాక్ట్‌ను రద్దు చేశాం. రీ సర్వే పేరుతో ప్రజల భూముల సరిహద్దులు చెరిపేశారు వాటిని సరిచేస్తున్నాం. ప్రభుత్వానికి వచ్చిన ఫిర్యాదుల్లో సగం భూ సమస్యలే ఉన్నాయి అని భూ సమస్యలపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయి అన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభించాం పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీటిని అందిస్తామని హామీ ఇచ్చారు. రాయలసీమలో ప్రతి ఎకరాకు నీళ్లివ్వాలనేది నా లక్ష్యం అని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని అన్నారు.
కర్నూలు నుంచి బళ్లారికి జాతీయ రహదారి తెస్తాం. కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుచేస్తాం. మెరుగైన మద్యం పాలసీ తీసుకొచ్చాం. రూ.100 కోట్లతో మద్యం మాన్పించే కార్యక్రమం చేపడతాం. ఓర్వకల్లులో పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం అన్నారు. దీపావళి నుంచి మహిళలకు ఉచితంగా గ్యాస్‌ సిలిండర్లు అని గ్యాస్‌ సిలిండర్‌ పంపిణీని దీపావళి రోజు ప్రారంభిస్తాం అని మహిళలకు ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తాం అన్నారు. వాలంటీర్లు లేకపోతే ఏం చేయలేరన్నారు. వాళ్లు లేకపోయినా పింఛన్లు పంపిణీ చేస్తున్నాం. వాలంటీర్లను ఏం చేయాలో ఆలోచిస్తున్నాం” అని సీఎం తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహారశుద్ధి శాఖ మంత్రి టి.జి.భరత్, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, డిఐజి కోయ ప్రవీణ్ కుమార్, జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా,జిల్లా ఎస్పీ బిందు మాధవ్,మాజీ మంత్రులు కేఈ కృష్ణమూర్తి,కే ఈ ప్రభాకర్, పత్తికొండ శాసనసభ్యులు కెఈ.శ్యామ్ బాబు, ఆదోని శాసన సభ్యులు డా.పార్థసారథి వాల్మీకి, గుంతకల్లు శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం, టిడిపి జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి, మాజీ శాసనసభ్యులు మీనాక్షి నాయుడు, మంత్రాలయం ఇంఛార్జి రాఘవేంద్ర రెడ్డి, ఆలూరు ఇంఛార్జి వీరభద్ర గౌడు,
జేసీ నవ్య,ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్,అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి,పత్తికొండ ఆర్డీఓ రామలక్ష్మి,పత్తికొండ డి.ఎస్పీ వెంకట్రామయ్య,
టీడీపీ నాయకులు సాంబశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
600318
Total Users : 68002