ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యే విరూపాక్షి అనుచరుల వీరంగం… గాలిమరల యంత్రాలు ధ్వంసం.. కమీషన్ కోసమే దాడులు చేసినట్లు అనుమానాలు.. 24 మంది అనుచరులు అదుపులోకి..
ఏపి టుడే న్యూస్,ఆలూరు:
ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అనుచరులు నియోజకవర్గ పరిధిలోని ఆలూరు,దేవనకొండ మండలాలలోని గాలిమరల సబ్ స్టేషన్ లోని యంత్రాలను ధ్వంసం చేసి వీరంగం సృష్టించారు. అనంతరం అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పై కూడా దాడికి పాల్పడ్డారు.అయితే మొలగవల్లి,జొహరాపురంతో పాటు దేవనకొండ మండలం జిల్లేడుబుడకల గ్రామాల్లో గమేసారి,న్యూ,గ్రీన్ ఇన్ఫ్రా సంస్థల గాలిమరల యాజమాన్యం ఎమ్యెల్యే అనుచరులకు కమీషన్ విషయంలో విభేధాలు రావడంతోనే కార్యాలయాలలోని కంప్యూటర్లు,యంత్ర సామగ్రి,ఫర్నీచర్, కిటికీలు ధ్వంసం చేసినట్లు సమాచారం.
దాడులకు పాల్పడిన విషయం తెలుసుకున్న గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ సోదరులు శ్రీనివాసులు,నారాయణ తమ అనుచరులతో కలసి ధ్వంసం అయిన సబ్ స్టేషన్లను కార్యాలయాలను పరిశీలించి ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అనుచరుల తీరును తీవ్రంగా ఖండించారు. వెనుకబడిన ఆలూరు నియోజకవర్గ పరిధిలోని పరిశ్రమలను అడ్డుకోవడానికి ఇలాంటి సంఘటనలకు పాల్పడుతున్నారు అని తగదని వారు స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా ఎస్పీ బిందుమాధవ్ దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఎమ్మెల్యే అనుచరుల అరెస్ట్…
గాలిమరల సబ్ స్టేషన్ కార్యాలయాలపై దాడి జరిగిన విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వెంటనే అప్రమత్తమైన ఆలూరు సిఐ శ్రీనివాసులు నాయక్,ఎస్ఐ నరసింహులు,పత్తికొండ సిఐ జయన్న,దేవనకొండ సిఐ వంశీనాథ్ తమ సిబ్బందితో కలిసి ఎమ్మెల్యే విరూపాక్షి సోదరుడు వెంకటేష్ దేవనకొండ జడ్పీటీసీ కిట్టుతో పాటు మొత్తం 24 మంది అనుచరులను దేవనకొండ టర్నింగ్ ఆర్ఆర్ ఫంక్షన్ నందు అదుపులోకి తీసుకుని ఆలూరు స్టేషన్ కు తరలించారు.అంతే కాకుండా సంఘటన జరిగిన ప్రదేశంలో సిసి కెమెరాలు ఆధారాలు ఇంకా ఎవరైనా నిందితులు ఉంటే వారిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుందని తెలిపారు.




-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 67959