ఆంధ్రప్రదేశ్
సీఎం సహాయ నిధికి రు.50 లక్షల భారీ విరాళం.
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
జిల్లాలోని పొదుపు లక్ష్మి మహిళల వితరణ.
జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా.
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన వరద బాధితులను ఆదుకునేందుకు జిల్లా పొదుపు లక్ష్మి మహిళలు ముందుకు వచ్చారని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పేర్కొన్నారు.
శుక్రవారం కలెక్టరేట్లోని సెంటనరీ హాలులో స్వర్ణాంధ్ర@2047 జిల్లా దార్శినిక పత్ర రూపకల్పనలో భాగంగా జిల్లాలోని పొదుపు లక్ష్మి మహిళలు 50 లక్షలు జమ చేసి చేసిన మొత్తంలో మొదటి దఫా 20 లక్షల రూపాయలను శ్రీశైలం శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేశారన్నారు. జిల్లాలోని అన్ని మండలాలలోని పొదుపు లక్ష్మి మహిళలందరూ తమ వంతు వితరణగా 50 లక్షల రూపాయల మొత్తాన్ని జమ చేశారన్నారు. ఇందులో భాగంగానే మిగిలిన 30 లక్షల రూపాయలను సీఎం సహాయనిధికి అందజేస్తున్నారని కలెక్టర్ తెలిపారు.
ప్రకృతి వైపరీత్యాల వల్ల తీవ్రంగా నష్టపోయిన బాధితులకు జిల్లా తరఫున దాతలు ముందుకు వచ్చి ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు ఇస్తున్నారని కలెక్టర్ వెల్లడించారు. ఇప్పటివరకు దాతలు విరాళాలు ఇచ్చిన మొత్తాల కంటే పేదలైన పొదుపు లక్ష్మి మహిళలు మానవతా దృక్పథంతో తమ వంతు వితరణను భారీగా సేకరించి జిల్లా తరఫున ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల రూపాయలను అందజేయడం హర్షనీయమని కలెక్టర్ తెలిపారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 68127