ఆంధ్రప్రదేశ్
సేవా కార్యక్రమాల్లో ఆర్యవైశ్యులు ముందుంటారు.. రాష్ట్ర మంత్రి టి.జి భరత్
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో

ప్రజలకు కష్టం వస్తే ముందుగా సహాయం చేసేందుకు ఆర్యవైశ్యులు వస్తారని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ అన్నారు. విజయవాడలోని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రలో అవోపా మహిళా విభాగ్ ఆధ్వర్యంలో వరద బాధితుల సహయార్ధం నగదు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి టి.జి భరత్ ముఖ్య అతిధిగా పాల్గొని వరద బాధితులకు ఒక్కొక్కరికి రూ. 5 వేలు చెక్కును అందించారు. ఈ సందర్భంగా మంత్రి టి.జి భరత్ మాట్లాడుతూ సేవకు మారుపేరు ఆర్యవైశ్యులన్నారు. వరదల వల్ల నిరాశ్రయులైన కుటుంబాలకు ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆర్థిక సహాయం చేయడం అభినందించదగ్గ విషయం అన్నారు. వరదల వలన అనేకమంది ప్రజలు నిరాశ్రయులయ్యారని, సీఎం చంద్రబాబు దగ్గరుండి సహాయక చర్యలు పర్యవేక్షించారన్నారు. వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుందని, ప్రభుత్వ పిలుపుమేరకు వరదల వల్ల నిరాశ్రయులైన 600 కుటుంబాలకు 5000 చొప్పున 30 లక్షల రూపాయలు ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. అవోపా అంటేనే క్రమశిక్షణ అన్నారు. ఆర్యవైశ్యులు రాజకీయాల్లో రాణించి ప్రజలకు మరింత సేవ చేయాలన్నారు. తన తండ్రి టి.జి వెంకటేష్ ఆర్యవైశ్యులకు ఎప్పుడూ అండగా ఉన్నారని.. తాను కూడా ఆయన బాటలోనే నడుస్తానని మంత్రి టి.జి భరత్ అన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఆరవేటి నిర్మల, రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు కర్నూలుకు చెందిన అవోపా రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ మలిపెద్ది నాగేశ్వరరావు, చలువాది మల్లికార్జున, శ్రీశైల సత్ర సముదాయం అధ్యక్ష కార్యదర్శులు దేవకి వెంకటేశ్వర్లు, ఇల్లూరు లక్ష్మయ్య, రాష్ట్ర కార్యదర్శి సుబ్బారావు, ట్రెజరర్ శంకర్ నారాయణ గుప్తా, విజయవాడ అవోపా అధ్యక్ష కార్యదర్శులు చెంచయ్య, దారా సత్యనారాయణ, విజయవాడ మహిళా విభాగ్ సభ్యులు సరిత, జ్యోతి, రూపవాణి, దుర్గ దేవి, గాదం శెట్టి సుజాత, ఆదిలక్ష్మి, మున్నలూరు రాధ, విజయలక్ష్మి, మహిళా విభాగ రాష్ట్ర కార్యదర్శి నాగమని, రాష్ట్ర ఉపాధ్యక్షులు కనకరాజు, తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 68051