ఆంధ్రప్రదేశ్
చదువుతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

పాణ్యం :
ఎమ్మెల్యే చేతుల మీదుగా స్టూడెంట్స్ కిట్స్ పంపిణి కార్యక్రమం..
మొక్కలు నాటిన ఎమ్మెల్యే,ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కార్యకర్తలకు పిలుపు
ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామం
చదువుతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు అని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి గారు అన్నారు. శనివారం మండల పరిధిలోని నన్నూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ప్రానెష్ కుమార్ విద్యార్థులకు స్టూడెంట్స్ కిట్స్ పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యార్థులకు స్టూడెంట్ స్కిట్స్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తుందని విద్యార్థులు అందరూ ఉన్నత చదువులు చదువుకొని ఉన్నత హోదాల్లో స్థిరపడి బావి భారత పౌరులుగా దేశానికి సేవ చేయాలని అన్నారు
ఓర్వకల్లు మండలాన్ని పరిశ్రమల హబ్ గా చంద్రబాబు నాయుడు గుర్తించారని మండలంలోని ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని విద్యార్థులకు తెలియజేశారు. మండల వ్యాప్తంగా 10,000 మొక్కలు నాటే కార్యక్రమం ఎంపీడీవో చేపట్టడం జరిగిందని మండల వ్యాప్తంగా టిడిపి నాయకులు కార్యకర్తలు అందరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఓంకార్ యాదవ్,ఎంపీడీవో మల్లేశ్వరి,ఎమ్మార్వో నటరాజ్,ఎన్జీసీ జిల్లా కోఆర్డినేటర్ రాజశేఖర్, మండల కన్వీనర్ గోవిందరెడ్డి గుట్టపాడు మోహన్ రెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డి జాతీయ మహిళ హక్కుల రాష్ట్ర అధ్యక్షులు అనిషా పాషా,సర్కార్, కాజా మియా,విజయుడు, రాయలసీమ విద్యార్ధి విభాగం జేఏసీ అధ్యక్షుడు శ్రీ రాములు నవ్యాంధ్ర జేఏసీ అధ్యక్షుడు అయ్య స్వామి మరియు తదితరులు పాల్గొన్నారు
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక