ఆంధ్రప్రదేశ్
ప్రజా శాంతికి భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన జిల్లా పోలీస్ అధికారులు.
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.


నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్ ఆదేశాలమేరకు జిల్లా పోలీస్ అధికారులు ఆదివారం తమ తమ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లు, చెడు నడత గల వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ రౌడీ షీటర్లు ప్రజాశాంతికి భంగం కలిగించే విధంగా ప్రవర్తించిన యెడల వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ చెడు అలవాట్లకు స్వస్తి చెప్పి సత్ప్రవర్తనతో మెలగాలని, ఎవరైనా దానికి భిన్నంగా వ్యవహరిస్తే ఉపేక్షించబోమన్నారు. ఎక్కడ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డా చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీస్ శాఖ ఆదేశాలను, సూచనలను పెడచెవిన పెట్టి ప్రజాశాంతికి భంగం కలిగించే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే వారిపై పీడీ యాక్ట్ అమలుపరుచుట జరుగుతుందని పోలీస్ అధికారులు హెచ్చరించారు. పోలీస్ అధికారులు మీ యొక్క ప్రతి కదలికలను గమనిస్తూ ప్రత్యేక నిఘా ఉంచుతారని జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 68011