ఆంధ్రప్రదేశ్
మదీనా ఎంటర్ ప్రైజెస్ ఆధ్వర్యంలో నూతన టైల్స్ షోరూమ్ ప్రారంభం

ఏపీ టుడే న్యూస్ నంద్యాల రూరల్ రిపోర్టర్.
ముఖ్య అతిథులుగా పాల్గొన్న టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ ,ఎపి మార్క్ ఫెడ్ డైరెక్టర్ తులసిరెడ్డి.
నంద్యాల పట్టణం పద్మావతి నగర్ లోని పీఎం జ్యువెలర్స్ ఎదురుగా మదీనా ఎంటర్ ప్రైజెస్ ఆధ్వర్యంలో టైల్స్ అండ్ సానిటరీ వేర్ షాపును నూతనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ , ఏపీ మార్క్ ఫెడ్ రాష్ట్ర డైరెక్టర్ తాతిరెడ్డి తులసి రెడ్డి, లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ ,తులసి రెడ్డి మాట్లాడుతూ మదీనా ఎంటర్ప్రైజెస్ ఆధ్వర్యంలో సోమన్ టైల్స్ డీలర్ షిప్ ను తీసుకోవడం జరిగిందని, అభివృద్ధి చెందుతున్న నంద్యాల లాంటి ప్రాంతంలో షోరూంలు రావడం అభినందనీయమన్నారు. హైదరాబాద్, బెంగళూరు లాంటి చోట్ల ఉండే గ్రానైట్స్ తెచ్చుకోవాలంటే రవాణా చార్జీల భారం పడుతుందని, ఇక్కడే డీలర్ షిప్ ఉండడం వల్ల నాణ్యతతో కూడిన టైల్స్ ను తక్కువ ధరకే అందుబాటులో ఉంటాయన్నారు. నంద్యాల నంద్యాల ప్రాంతంలో కూడా అధిక నిర్మాణాలు చేపడుతున్నారని, అటువంటి వారికి ఈ టైల్స్ అందుబాటులో రావడం సంతోషకరమన్నారు. మదీనా ఎంటర్ప్రైజెస్ యజమానులు షేక్ హనీఫ్, జబీవుల్లా, రఫీలు మాట్లాడుతూ సోమన్ కంపెనీ ఆధ్వర్యంలో అన్ని రకాల టైల్స్ అన్ని సైజుల్లో అందుబాటులో ఉంచామని, స్లిప్ షిల్డ్, విసి షిల్డ్, టెంప్ షిల్డ్, ఫుల్ బాడీతో పాటు అన్ని రకాల టైల్స్, శానిటరీ ఐటమ్స్ తమ వద్ద అందుబాటులో ఉంటాయని, సరసమైన ధరలకే నాణ్యతతో కూడుకున్న టైల్స్ ను అందుబాటులో ఉంచామని, ప్రజలు తమ షోరూమ్ ను సందర్శించి ఆదరించాలని కోరారు. సోమన్ కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతంలోనే నంద్యాల జిల్లా కేంద్రంలో కంపెనీ షోరూమ్ ప్రారంభించడం జరిగిందని, గతంలో హైదరాబాద్, బెంగళూరు లాంటి మహా నగరాలకు వెళ్లి ఇటువంటి టైల్స్ పొందే వారని, ప్రస్తుతం నంద్యాలలోనే వీటిని అందుబాటులోకి తెచ్చామన్నారు. సోమన్ కంపెనీ ఇండియాలోనే టాప్ 2లో ఉందని, 52 సంవత్సరాల చరిత్ర కలిగిన కంపెనీ అని వారు వివరించారు. టైల్స్, సానిటరీవేర్, సిపి ఫిట్టింగ్స్, అన్ని రకాల టైల్స్ ఇక్కడ లభ్యమవుతాయని, వినియోగదారుడికి ఆన్ లైన్లోనే తమ ఇంజనీర్లతో మాట్లాడే సౌలభ్యం ఉందని, నాణ్యతతో పాటు తక్కువ ధరలకే నాణ్యమైన టైల్స్ ఉంటాయని వారు వివరించారు. నంద్యాల పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ షోరూం ప్రారంభోత్సవంలో పెద్ద సంఖ్యలో పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక