ఆంధ్రప్రదేశ్
ప్రజా సమస్యల పరిష్కారంలో పారదర్శకత పాటించాలి
ప్రజా సమస్యల పరిష్కారంలో పారదర్శకత పాటించాలి
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చే ప్రజా సమస్యల పరిష్కారంలో పారదర్శకత పాటించాలని నగరపాలక అదనపు కమిషనర్ ఆర్.జి.వి. కృష్ణ అధికారులను ఆదేశించారు. సోమవారం నగరపాలక కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి 19 అర్జీలు వచ్చాయి. వాటన్నింటినీ త్వరితగతిన పరిష్కరించాలని అదనపు కమిషనర్ సంబంధింత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మేనేజర్ ఎన్.చిన్నరాముడు, ఆరోగ్యధికారి కె.విశ్వేశ్వర్ రెడ్డి, ఆర్ఓ జునైద్, ఎంఈ సత్యనారాయణ, టిపిఆర్ఓ వెంకటలక్ష్మి, టిడ్కో అధికారి పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.
*వచ్చిన అర్జీల్లో కొన్ని..*
1. జగన్నాథ గట్టు టిడ్కో గృహాల వద్ద మంచినీటి సరఫరా, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, అలాగే బియ్యం, పింఛన్ సరఫరా చేయాలని అక్కడి నివాసులు కోరారు.
2. గణేష్ నగర్ నాల్గవ తరగతి ఉద్యోగుల కాలనీ ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలో అలాగే వాణిజ్య నగర్, గీత నగర్‌లలో వర్షాలతో రహదారులు గుంతలు, బురదమయంగా మారిందని, వెంటనే డబ్లుబియం రహదారి నిర్మించాలని స్థానికులు ఎస్.శేఖర్, ఎం.డి. మెహారాజ్, ఎన్.మద్దిలేటి, సునీల్, ప్రశాంత్, వెంకటేష్ వేర్వేరు అర్జీలు సమర్పించారు.
3. ఆదిత్య నగర్, బళ్ళారి చౌరస్తా సమీపంలో మహింద్రా సర్వీస్ సెంటర్ దగ్గర తమ నివాసాలకు సిసి డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటులో ఏడాది కాలంగా జాప్యం జరుగుతోందని, తద్వారా ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు మనోహర్ రెడ్డి, ప్రశాంత్, భూషణ్ ఫిర్యాదు చేశారు.
4. ఒమేగ ఆసుపత్రి సమీపంలో శ్రీవారి సుదర్శనము కాలనీ నందు తాగునీటి సరఫరా లేదని, గతంలో పలుమార్లు ఫిర్యాదు చేశామని స్థానికులు కోరారు.
5. మద్దూర్ నగర్, ఠాగూర్ నగర్ నందు తమ షాపుల ఎదుట చిన్నపాటి వర్షానికే ప్రధాన రహదారిపై నీరు నిల్వ అవుతుందని, రహదారిపై అవసరమైన నిర్మాణాలు, సిసి డ్రైనేజీ కాలువ సామర్థ్యం పెంచాలని స్థానికులు దిలిప్ కుమార్, బి.ప్రసాద్ బాబు కోరారు.
6. ఆశోక్ నగర్ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ఎదుట ఫుట్‌పాత్‌పై మట్టి పేర్కొపోయిందని, తద్వూ పాదచారులకు ఇబ్బంది కలుగుతుందని, అదే విధంగా నగరంలో పార్కుల్లో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు పుల్లారెడ్డి, నాగరాజు కోరారు.
7. ముజఫర్ నగర్ వాటర్ ట్యాంకు వద్ద అసంపూర్తిగా ఉన్న 81, 82వ సచివాలయాల భవనాలను త్వరగా పూర్తి చేస్తే, నండూరిప్రసాదరావు మెమోరియల్ కమ్యూనిటీ హాలులో ఉన్న సచివాలయాలను తరలించవచ్చని, తద్వారా ప్రజలు కమ్యూనిటీ హాల్ ఉపయోగించుకుంటారని హాల్ కమిటీ సభ్యులు కె.సుధాకర్ రెడ్డి, సిహెచ్ సాయిబాబ, ఆనంద్ కోరారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87465