ఆంధ్రప్రదేశ్
మునిసిపల్ స్థలాలను కాపాడండి లేదా పేదలకు పంచండి
ఏపీ టుడే న్యూస్ నంద్యాల రూరల్ రిపోర్టర్.
సిపిఐ (యం యల్ ) లిబరేషన్ పార్టీ.
జిల్లా నాయకుడు గాలి రవిరాజ్ డిమాండ్.
ప్రభుత్వ భూముల్లో పేదలు జానెడు స్థలాన్ని ఆక్రమిస్తే ఎక్కడ లేని చట్టాలు తీసుకవచ్చే అధికారులు నంద్యాల పట్టణంలోని నడిబొడ్డున వున్న మునిసిపల్ స్థలాన్ని ఆక్రమించి యదేచ్చగా రూమలు కడుతున్న మునిసిపల్ అధికారులు కళ్ళుండి గుడ్డివారిగా నటిస్తున్నారని సిపిఐ (యం యల్ ) లిబరేషన్ పార్టీ జిల్లా నాయకుడు గాలి రవిరాజ్ ఆరోపించారు. అనంతరం రవిరాజ్ ఎఐయస్ ఎ నాగార్జున లు మాట్లాడుతూ నంద్యాల జిల్లాగా మారిన దగ్గర నుండి భూ కబ్జాలు ఎక్కువైయాయన్ని వాటిని నియంత్రించడంలో అధికారులు విఫలమైయ్యారని వారు దుయ్యబట్టారు. భూ ఆక్రమణ దారులకు అధికారులు ఒంత పాడుతున్నారని ఆయన ఆరోపణలు చేశారు. భూ ఆక్రమణ దారులకు వంత పాడే అధికారులకు ఏమాత్రం చిత్తశుద్ధి వున్న తమ ఆదినంలో వున్న మునిసిపల్ స్థలాలను పేదలకు పంచాలని ఆయన డిమాండ్ చేశారు. మునిసిపల్ అధికారులు పాలకొమ్మ చెట్టు స్థలంలో అనదికారంగా కట్టిన వాటిని కూల్చివేసి స్థలాన్ని వారి ఆదినంలోకి తీసుకొని యెడల సిపిఐ (యం యల్ ) లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో మునిసిపల్ స్థలాలలో పేదలను కలుపుకొని జెండాలు పాతి పేదలకు పంచుతామని వారు హెచ్చరించారు. పేదలకు ఒక న్యాయం రాబంధులకు ఒక న్యాయమా అని వారు మునిసిపల్ అధికారులను సూటిగా ప్రశ్నించారు. పేదప్రజలకు ఒక న్యాయం భూ ఆక్రమణ దారులకు ఒక న్యాయమా చట్టం న్యాయం అందరికి సమానంగా ఉంటాయని ఇకానైనా మునిసిపల్ అధికారులు కపటనిద్రా మేలుకోకపోతే జరిగే పరిణామలకు అధికారులే బాధ్యత వ్యవహరించాల్సీ వస్తుందని వారు హితువు పలికారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87490