ఆంధ్రప్రదేశ్
వరి పంటలో ఎలుకల నివారణ చర్యల పై రైతులకు అవగాహన…. వ్యవసాయ అధికారి శ్రీ కృష్ణ
ఏపీ టుడే న్యూస్,
నంద్యాల జిల్లా రుద్రవరం.

రైతులు సాగు చేసిన వరి పంటలో ఎలుకల నివారణకు తీసుకోవలసిన చర్యలపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు వ్యవసాయ అధికారి శ్రీకృష్ణ తెలిపారు. బుధవారంమండలంలోని 16 రైతు సేవ కేంద్రాలలో సామూహిక ఎలుకలు నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పెద్ద కంబలూరు , యల్లావత్తుల గ్రామాలలోని రైతు సేవ కేంద్రాలలో మండల వ్యవసాయ అధికారి శ్రీకృష్ణ ఆధ్వర్యంలో ఎలుకల నిర్మూలన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా వరి సాగుచేసిన రైతులకు వరి పంట నాశించే ఎలుకలను నిర్మూలించడం కొరకు 100% సబ్సిడీపై బ్రోమో డయోలిన్ 0.25 సిబి మందును వారు తెచ్చుకున్న నూక మరియు నూనె కు బ్రోమోడయోలిన్ మందును (96% నూకలు రెండు శాతం నూనె రెండు శాతం బ్రో మోడైయులను మందు ) కలిపిన విషపు ఎరను రైతులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి రాజు రైతు సేవ కేంద్రాల సిబ్బంది నవీన్ కుమార్ రెడ్డి,రేష్మ మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87466