Connect with us

ఆంధ్రప్రదేశ్

జాతికి సన్మార్గాన్ని నిర్దేశించిన మహోన్నత వ్యక్తి మహర్షి వాల్మీకి – జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా

Published

on

ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో అక్టోబర్ 17;

రామాయణాన్ని మహా అద్భుత కావ్యంగా మలిచి జాతికి సన్మార్గాన్ని నిర్దేశించిన మహోన్నత వ్యక్తి మహర్షి వాల్మీకి అని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు.

గురువారం ఉదయం మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా గౌరీ గోపాల్ హాస్పిటల్ సర్కిల్ వద్ద ఉన్న మహర్షి వాల్మీకి విగ్రహానికి జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పుణ్య భూమి, కర్మ భూమి మన భారత దేశమని రామాయణం మన పూజ్య గ్రంథమని అలాంటి గ్రంథాన్ని రచించిన మహర్షి వాల్మీకి పూజ్యనీయులన్నారు. వాల్మీకి మహర్షి రామాయణంలో దాదాపు ఇరభై నాలుగు వేల శ్లోకాలు రాశారని, తన చుట్టూ పుట్ట పెరిగినా తన దీక్షను, తపస్సును విడువకుండా పూర్తి చేసిన మహానుభావుడు అందుకే వారు వాల్మీకి మహర్షి అయ్యారని తెలిపారు. మహర్షి వాల్మీకి జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వ పండుగగా ఆచరిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు.

కార్యక్రమంలో టూరిజం డైరెక్టర్ ముంతాజ్, వాల్మీకి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తలారి కృష్ణమ నాయుడు, విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు బీసీ మద్దిలేటి, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, బీసీ వెల్ఫేర్ అధికారి వెంకట లక్ష్మమ్మ,వాల్మీకి బోయ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు కుబేర స్వామి, కురువ, మాదాసు కురువ సంక్షేమ సంఘం అధ్యక్షులు రామకుమార్,బీసీ వెల్ఫేర్ జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కల మిట్ట శ్రీనివాసులు,బీసీ సంఘాల నాయకులు సత్రం రామకృష్ణ, బేతం కృష్ణుడు, సందడి మహేష్, ఈపూరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580263
Total Users : 47947