ఆంధ్రప్రదేశ్
మహిళలకు ఉచిత బస్సు – ప్రయాణం హామీ అమలు చేయాలి.నంద్యాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దాసరి చింతలయ్య.
ఏపీ టుడే న్యూస్ నంద్యాల బ్యూరో నంద్యాల జిల్లా(అక్టోబర్ 22)
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో మహిళలకు ఇచ్చిన హామీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలు చేయాలని, చేయని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం నిర్వహిస్తున్నట్లు నంద్యాల కాంగ్రెస పార్టీ అధ్యక్షుడు దాసరి చింతలయ్య తెలిపారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో దాసరి చింతలయ్య మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ(కూటమి ప్రభుత్వము) ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల హామీలలో భాగంగా ఏ ఒక్కటి అమలు కాలేదని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళలకు హామీ ఇచ్చారని, గెలిచిన అనంతరం ఇచ్చిన హామీలు మరిచారని అన్నారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు కావస్తున్న ఉచిత బస్సు ప్రయాణం అమలు అతి గతి లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి ఆదేశాల మేరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలని కోరుచూ 22 వ తేది నుండి 28 తేది వరకు నంద్యాల జిల్లా లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రములలో నియోజకవర్గాల ఇన్చార్జిలు,కో ఆర్డినేషన్ సభ్యుల ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలను సమన్వయంతో మహిళలతో కలిసి ఆర్టీసి బస్సులో ప్రయాణించి మహిళలకు పోస్ట్ కార్డు ఉద్యమం గురించి తెలియజేసి, ఉచిత బస్సు ప్రయాణం హామీ వెంటనే అమలు చేయాలని వారిచేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పోస్ట్ కార్డుపై మహిళా ప్రయాణికులతో సంతకాలు చేయించి ముఖ్యమంత్రి కార్యాలయం చిరునా మాకు వెలగపూడి అమరావతికి పంపుతామని అన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజ కవర్గ ఇన్చార్జిలు,కో ఆర్డినేషన్ సభ్యలు విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నంద్యాల టౌన్ అధ్యక్షులు దాసరి చింతలయ్య , ప్రసాద్ ,సలాం,నరసింహులు, రవి ,గోవిందరాజులు మొదలగు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87123