ఆంధ్రప్రదేశ్
నాపై వచ్చిన ఆరోపణలు అవాస్తవం – సీనియర్ లెక్చరర్ వెంకట్ రామిరెడ్డి.

ఏపీ టుడే న్యూస్ నంద్యాల బ్యూరో నంద్యాల జిల్లా అక్టోబర్ 23.
నా వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించే వారిపై న్యాయపరంగా చర్యలు తీసుకోవడానికి వెనుకాడను
నాపై వచ్చిన ఆరోపణలు ఆ వాస్తవమని, నా వ్యక్తిగత ప్రతిష్టతను భంగం కలిగించే వారిపై న్యాయ పరంగా చర్యలు తీసుకోవడానికి వెనకాడనని సీనియర్ లక్షల వెంకట్రామిరెడ్డి పట్టణంలోని సూరజ్ హోటల్లో విలేఖర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
గత ఎన్నో సంవత్సరాలుగా నంద్యాలలోని పలు జూనియర్ కళాశాలలో అధ్యాపక వృత్తిలో కొనసాగుతూ ఉన్నాను.
నాకు ఏ కాలేజీలో కూడా చెడ్డ పేరు వచ్చిన దాఖలాలు లేవు.
ఒకవేళ చెడు ఆరోపణలు వచ్చి ఉంటే వెంటనే సదరు కాలేజి నుంచి తొలగించడం జరుగుతుందని అన్నారు.
అలాంటి సంఘటనలు ఏ కోశాన నా చరిత్రలో జరగలేదని చెప్పారు.
నాపై కక్షగట్టి నా వ్యక్తిగత స్వేచ్ఛకు,ప్రతిష్టకు భంగం కలిగించాలన్న దురుద్దేశంతోనే
ఈ ఆరోపణలు చేయడం దుర్మార్గం,దుశ్చర్య అని మండిపడ్డారు.
పాణ్యం చెందిన సమాజ్ వాది పార్టీ నాయకుడు పెరుగు కృష్ణ యాదవ్ అనే వ్యక్తి చేసిన ఆరోపణలలో ఎలాంటి వాస్తవాలు లేవని
ఈ సందర్భంగా తెలియజేస్తూ నిజ నిర్ధారణ చేయడానికి ఈ రోజు మీడియా ముందుకు రావడం జరిగిందని లెక్చరర్ వెంకటరామిరెడ్డి తెలిపారు.
సమాజ్ వాది పార్టీ నాయకుడు కృష్ణ యాదవ్ వెనక ఎవరున్నారో??నాపై కుట్రలు తనతో ఎవరు చేయిస్తున్నారో, బయటికి రావాలని ఆయన కోరారు.
కృష్ణ యాదవ్ అనే వ్యక్తికి ఎందుకంత పర్సనల్ ఇంట్రెస్టో నాకు అర్థం కావడం లేదు. అలాగే తనతో నాకు వ్యక్తిగతంగా గొడవలు లేవు.
కానీ నాపై కృష్ణ యాదవ్ తో కళాశాల అడ్మిషన్ లు నిర్వహించే మే నెలలో విద్యార్ధినుల పట్ల నేను అసభ్యంగా ప్రవర్తించానని ఆరోపణలు చేయడమెంటో వారి విజ్ఞతకే వదిలేస్తున్నాని అన్నారు.
అతనే స్వయంగా వీడియో తీసుకుని నాపై ఆరోపణలు చేయడం ఎంత వరకు సమంజసమని లెక్చరర్ వెంకట్రామిరెడ్డి అన్నారు.
నాపై పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఏ విద్యార్థిని తల్లిదండ్రులు కానీ నాపై కంప్లైంట్ ఇవ్వడం కానీ జరగలేదు. అలాంటి సమయంలో విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినాడని నాపై సదరు అనామక వ్యక్తి ఆరోపణలు చేయడం,అంతేకాకుండా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కు కూడా నాపై ఫిర్యాదు చేస్తానని అనడం ఎంతవరకు సమంజసం అని అన్నారు.
కాబట్టి మీడియా మిత్రులారా నిజాల్ని నిర్భయంగా బయటికి తీసే మీరు వాస్తవాలను వెలికి తీసి,నాపై నిజంగా ఇటువంటి ఆరోపణలు వచ్చి ఉంటే మీరే నిగ్గు తేల్చాలని
ఈ సందర్భంగా వారు అన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 87481