ఆంధ్రప్రదేశ్
మహానందిలో కార్తీక మాసం ఏర్పాట్లపై సమావేశం .. -భక్తులకు అందుబాటులో కార్తీక మాస పరోక్ష అభిషేకం…

ఏపీ టుడే న్యూస్, మహానంది (అక్టోబర్ 24)
మహానంది పుణ్యక్షేత్రంలో కార్తీకమాసం సందర్భంగా నవంబర్ రెండవ తేదీ నుండి డిసెంబర్ ఒకటవ తేదీ వరకు మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో నల్ల కాల్వ శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. గురువారం కార్తీక మాస ఏర్పాట్లపై ఆలయ ఈవో దేవస్థానం కార్యాలయంలో ఆలయ అధికారులు, సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. కార్తీక మాసంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేవిధంగా, తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. చేపట్టవలసిన ఏర్పాట్లు అన్ని ముందస్తుగానే పూర్తి చేయాలని సూచించారు. కార్తీక మాసంలో ముఖ్యంగా కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి, బహుళ ఏకాదశి లు ప్రభుత్వ సెలవు దినాలు, లలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని,రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యెక క్యూ లైన్లు ఏర్పాట్లను ముందస్తుగా చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా కోనేరులలో పవిత్ర స్నానాలు, మరుగుదొడ్లు , మహిళలు దుస్తులు మార్చుకునే గదులు, శుభ్రంగావుంచే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. అంతేకాకుండా భక్తులకు రూ. 2000 రూపాయలతో కార్తీక మాస పరోక్ష అభిషేకం సేవలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులు ఈ కార్తీకమాస పరోక్ష సేవ రుసుము చెల్లిస్తే, వారి గోత్రానామాలపైన కార్తీక మాసం నెల రోజులు, పరోక్ష అభిషేకం చేసి, వారికి ఆ మాసంలో ఒకరోజు ప్రత్యేక పూజలు నిర్వహించి, వారి చిరునామాకు స్వామి వారి శేష వస్త్రం, స్వామి వారి ప్రసాదము అందజేస్తామన్నారు. కార్తీక మాసంలో క్షేత్రానికి వచ్చే భక్తులకు మంచినీటి సరఫరా, వసతి సౌకర్యవంతమైన దర్శనం స్వామి అమ్మవార్ల ఆర్జిత సేవలు ఆలయ వేళలు, క్యూలైన్ల నిర్వహణ రద్దీ క్రమబద్ధీకరణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, పారిశుద్ధ్యం, పార్కింగ్ కార్తీక సోమవారాలలో లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి కార్తీక పౌర్ణమి సందర్భంగా జ్వాలాతోరణం, పుణ్య గంగా హారతి ఏర్పాట్లు కార్తీకమాసంలో ఆకాశదీపం ఏర్పాట్లు సాంస్కృతిక కార్యక్రమాలు మొదలైన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.ఈ మాసంలో సిబ్బందికి ప్రత్యేక డ్యూటీలు, దర్శనం ఏర్పాట్లు ఆర్జిత సేవలు, అన్న ప్రసాద వితరణ లడ్డు ప్రసాదాలు కోనేరు స్నానాలకు ఏర్పాట్లు, కేశఖండనశాలలో ఏర్పాట్లు సూచిక బోర్డులు ఈ మాసంలో శివసప్తహ భజనలు వంటి ఏర్పాట్లపై చర్చించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో మధు, ఆలయ పర్యవేక్షకులు శశిధర్ రెడ్డి,వేద పండితులు రవిశంకర అవధాని,ఉభయ దేవాలయాల ప్రధాన అర్చకులు , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక