ఆంధ్రప్రదేశ్
నేటి నుంచి రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలు – రగ్బీ పోటీల ఏర్పాటును పరిశీలిస్తున్న అసోసియేషన్ నిర్వాహకులు

ఏపీ టుడే న్యూస్ పాణ్యం రిపోర్టర్ అక్టోబర్ 24 :
పాణ్యం మండలంలోని ఆర్జీఎం ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం నుంచి మూడు రోజులపాటు రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలు ప్రారంభమవుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రగ్బీ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ రామాంజనేయులు తెలిపారు. శుక్రవారం కళాశాల మైదానంలో జరగబోయే రగ్బీ పోటీల ఏర్పాట్లను ఆయన తో పాటు ముంబాయికి చెందిన జాతీయ రగ్బీ కాంపిటీషన్ మేనేజర్ వికాస్ చౌరాసియా, టెక్నికల్ మేనేజర్ నోయల్ మాథ్యూస్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, అస్మిత రగ్బీ ఇండియా, ఆంధ్రప్రదేశ్ రగ్బీ అసోసియేషన్ సంయుక్తంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 25 నుంచి 27వ తేదీ వరకు జరిగే ఈ పోటీలలో సబ్ జూనియర్, జూనియర్,సీనియర్ విభాగాల విద్యార్థులు పాల్గొంటా రన్నారు. 25న ఉమ్మడి జిల్లాలోని 14 పాఠశాలకు చెందిన 160 మంది 26న 13 పాఠశాల కళాశాలకు చెందిన 150 మంది 27న రాష్ట్రంలోని 13 డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు 150 మంది పాల్గొంటారన్నారు.విజేతలకు ప్రైజ్ మనీ కింద రూ.లక్ష రూపాయలు బహుమతిగా అందిస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా కళాశాల మైదానంలో పోటీలో ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టినట్లు తెలిపారు. ముఖ్యంగా మహిళలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు ప్రకటించిందన్నారు.పోటీలకు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, రాష్ట్ర మంత్రి ఎన్ ఎం డి ఫరూక్,నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరిలు హాజరవుతున్నట్లు తెలిపారు.
మహిళలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రకటించిందన్నారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రగ్బీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు, ఆర్జేం కళాశాల ఫిజికల్ డైరెక్టర్లు వెంకట్,నాయక్,మంజుల, చంద్రారెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక