ఆంధ్రప్రదేశ్
కర్నూలులో కిలో చికెన్ రూ.100
కర్నూలులో కిలో చికెన్ రూ.100
నాగేంద్రుడు
ఏపీ టుడే న్యూస్ కర్నూలు బ్యూరో
స్థానిక మద్దూర్ నగర్ లోని షమీర్ మటన్ చికెన్ సెంటర్.. సుభాన్ మటన్ చికెన్ సెంటర్ ల నిర్వా హకులు ఆదివారం ఒకరికి మించి మరొకరు పోటీపడి చికెన్ ధరలు తగ్గించారు. దీంతో కొనుగోలుదారులు చికెన్ కొనుగోలు చేసేందుకు దుకాణాల వద్ద బారులు తీసి కిక్కిరిశారు. దీంతో వాహనాల రాకపోకలకు రెండు గంటలకు పైగా తీవ్ర అంతరాయం ఏర్పడింది. కార్తీకమాసం అయినప్పటికీ చాలావరకు చికెన్ కొనుగోలు చేసి ఇళ్లకు తీసుకెళ్లారు.
ఇదిలా ఉండగా సమీర్ చికెన్ సెంటర్ నిర్వాహకుడు మాట్లాడుతూ తనకు సొంత ఫారం ఉందని.. భాను తెలుగుదేశం పార్టీ అభిమాని అని.. టిడిపి.. మంత్రి కేజీ భరత్ గెలుపు దృష్టిలో ఉంచుకొని తన ఫారంలో ఉన్న కోళ్లన్నీ అయిపోయేంతవరకు తగ్గింపు ధరకే విక్రయిస్తానని స్పష్టం చేశారు.
సుభాన్ చికెన్ సెంటర్ నిర్వాహకుడు మాట్లాడుతూ కార్తీకమాసం కావడంతో చికెన్ కొనుగోలుదారులకు తనవంతుగా తగ్గింపు ధరలకు అందించడం జరుగుతుందని తెలిపారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87415