ఆంధ్రప్రదేశ్
మంత్రాలయంలో ఉచిత కంటి వైద్య శిబిరం……

ఏపీ టుడే న్యూస్ మంత్రాలయం రిపోర్టర్ నవంబర్ 28:
మంత్రాలయం మండల కేంద్రంలో ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన ప్రసిద్ధ ఆర్కే కంటి వైద్యశాల ఎండి హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో, మంత్రాలయం శ్రీ మఠం పరిధిలోని శ్రీ సుజయేంద్ర ఆరోగ్యశాలయందు ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రాలయం శ్రీ మఠం పీఠాధిపతి శ్రీ సుబుదేంద్ర తీర్థ స్వామీజీ విచ్చేసి వైద్య శిబిరాన్ని సందర్శించారు. మంత్రాలయం మండల పరిధిలోని గ్రామాల పేద ప్రజలు, భక్తులు ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. మంత్రాలయం మండల ప్రజలకు ఈ అవకాశాన్ని అందించడానికి పూనుకున్న ఆర్కే హాస్పిటల్ ఎండి హేమంత్ కుమార్ కు ఆశీస్సులు అందజేశారు.ఉచిత వైద్య శిబిరానికి మంత్రాలయం చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్కె కంటి వైద్యశాల మేనేజింగ్ డైరెక్టర్ హేమంత్ కుమార్ మాట్లాడుతూ…. ఆర్కె ఐ హాస్పిటల్ తరఫున నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి ఇంతటి జనాదరణ లభించడం చాలా ఆనందంగా ఉందని, ఇక్కడ వచ్చిన జనాలకు కంటికి సంబంధించిన పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నామని, ఆపరేషన్ అవసరమైన వారికి ఆపరేషన్ చేయించుకోవడానికి అవసరమైన ఖర్చును ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా వారు చేసుకోవచ్చని, ఆరోగ్యశ్రీ కార్డు లేనిపక్షంలో లేదా అర్హత పొందని పక్షంలో తక్కువ మొత్తానికే కూడా ఆపరేషన్ నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ సదావకాశాన్ని హాస్పిటల్ కు కల్పించినందుకు శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుబుదేంద్ర తీర్థ స్వామీజీ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక