ఆంధ్రప్రదేశ్
కుప్పం పట్టణంలో కొనసాగుతున్న రోడ్డు మరమ్మతు పనులు

చిత్తూరు జిల్లా/కుప్పం ఏపీ టుడే న్యూస్ డిసెంబర్ 8
కుప్పం పట్టణంలో రోడ్డు మరమ్మతు పనులు కొనసాగుతోంది. ఇందులో భాగంగా కొత్తపేట పరిధిలోని ప్రధాన రోడ్లపై గుంతలు పూడ్చడం, స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయడం వంటి పనులను పురపాలక సంఘం కమిషనర్ శ్రీనివాసరావు ఆదేశాలతో నిర్వహించారు. ఈ పనులను నియోజకవర్గ టిడిపి విస్తరణ విభాగ కమిటీ సభ్యులు కన్నన్, కొత్తపేట ఇంచార్జ్ ముఖేష్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో ఆకతాయి యువత ద్విచక్ర వాహనాలపై అతివేగంగా వెళుతూ స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, అలాగే ఈ మధ్యకాలంలో కురిసిన వర్షాలకు రోడ్లు గుంతల మయంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలిపారు. సమస్యల పరిష్కారానికై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో స్థానిక టిడిపి నాయకులు ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, ఏపీఎస్ఆర్టీసీ వైస్ ప్రెసిడెంట్ పిఎస్ మునిరత్నం, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ సురేష్ బాబుల సహకారంతో రోడ్డు మరమ్మత్తుల పనులు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సుబ్బు, షాదీ మహల్ మాజీ అధ్యక్షులు ఆన్సర్ భాష, టిడిపి నాయకులు కందస్వామి, సుకుమార్, సుజిత్ లు దగ్గర ఉండి స్పీడ్ బ్రేకర్లను వేయించడం, రోడ్లపై ఉన్న గుంతలను పూడిపించడం జరుగుతుంది.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87391