ఆంధ్రప్రదేశ్
అదిగో టిడ్కో ఇదిగో సమస్య

కృష్ణాజిల్లా మచిలీపట్నం ఏపీ టుడే న్యూస్ డిసెంబర్ 11
మచిలీపట్నంలోని టిడ్కో భవనాలకు ఎటువంటి ప్రహరీ గోడలు, వీధి దీపాలు లేని కారణంగా ఆకతాయిలు రెచ్చిపోతూ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని గం.. సేవిస్తూ అనేక సంవత్సరాలుగా ఉచ్చలవిడిగా ఇక్కడి ఆకతాయిలు నివాస భవనాలలో అరాచకాలు సృష్టిస్తున్నారని టిడ్కో గో సంఘం అసోసియేషన్ జంగాల నాగేంద్రం పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన టిడ్కో నివాస గృహాలలో మౌలిక సదుపాయాలు లేకపోవడం వలన లబ్ధిదారులు ఎవరు కూడా వారికి కేటాయించిన ఇళ్లలోకి రావడం కొరకు ఆసక్తి కనబరచడం లేదని లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్లను వారే అద్దెకిస్తూ లేదా అమ్మకాలు జరుపుతున్నారని, ఈ విషయమై తమ అసోసియేషన్ తరపున పలుమార్లు అధికారులకు అర్జీలు సమర్పించిన ఎటువంటి ప్రయోజనం చేకూరలేదని వాపోయారు. టిడ్కో నివాస గృహాల ప్రాంతంలో విశసర్పాల బెడద ఎక్కువగా ఉన్నదని అలాగే ఈ ప్రాంతంలో కుక్కలు, గొర్రెలు, ఆవులు విచ్చలవిడిగా సంచరిస్తున్నాయని ఇందువలన సమస్యలు రాకపోలేదని కొన్ని సందర్భాలలో గొడవలు కూడా జరిగినట్లు తెలిపారు. సమస్యల విషయమై సంబంధిత శాఖామంత్రికి విన్నవించుకున్న అలాగే మున్సిపల్ కమిషనర్ కు అర్జీలు సమర్పించిన ఎటువంటి స్పందన లేదని, టిడ్కో నివాస ప్రాంతంలో పలు దఫాలు గొడవలు జరుగుతున్న నేపథ్యంలో పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయవలసిందిగా తాము పోలీస్ ఉన్నతాధికారులను కోరుతున్నట్లు తెలిపారు. ఇకనైనా సంబంధిత శాఖ మంత్రి అలాగే మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ పై విషయాలపై ఆరా తీసి తగు చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 68061