Uncategorized
AP TODAY NEWS : జర్నలిస్ట్ ల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పని చేస్తాం
బి.చిన్న రామాంజనేయులు,కార్యదర్శి
నీలం సత్యనారాయణ,అధ్యక్షులు
నాగేంద్రుడు
ఏపీ టుడే న్యూస్ కర్నూలు
బ్యూరో
జర్నలిస్ట్ ల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పని చేస్తామని యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరమ్ కార్యదర్శి బి.చిన్న రామాంజనేయులు, అధ్యక్షులు నీలం సత్యనారాయణలు పేర్కొన్నారు.శుక్రవారం కర్నూలు నగరం, సమాచారశాఖ భవన్ లో యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరమ్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పాటుచేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సమాజంలో సమాచార సేకరణకు జర్నలిస్ట్ లు నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. అలాంటి వారు ప్రస్తుతం చాలిచాలని ఆదాయాలతో ఇబ్బందులకు గురవుతున్నట్లు చెప్పారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్ట్ పథకాలు చట్టబద్దంగా అమలుచేయాలనీ అన్నారు.ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం జర్నలిస్ట్ లకు అనేక హామీలు ఇచ్చిందని చెప్పారు.ఆ హామీ నిలుపుకోవాలని డిమాండ్ చేశారు. అక్రిడిటేషన్,విద్యారాయితీ,ఇళ్లస్థలాలు పంపిణీ వంటి హామీలు అమలుచేయాలనీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్ట్ ను చైతన్యం చేసి
యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరమ్ ముందుండి పోరాడుతోందని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో జర్నలిస్ట్ ల హక్కుల సాధనకు యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరమ్ నిర్వహించే పోరాటాల్లో జర్నలిస్ట్ లు సహకారం అందించాలని వారు కోరారు.అనంతరం జర్నలిస్ట్ లకు సభ్యత్వం నమోదు చేశారు.
ఈ కార్యక్రమంలో కోశాధికారి పఠాన్ యూసుఫ్ ఖాన్, ఉపాధ్యక్షులు పరమేష్,పి.నాగేంద్రుడు, సహాయ కార్యదర్శి రాజశేఖర్,ఈ.సి. సభ్యులు వి.విజయ్ కుమార్,జి.విజయ్ కుమార్,ఎస్.గంగాధర్,ఎస్.వరప్రసాద్,వై. వెంకటేశ్వర్ రెడ్డి,సభ్యులు ఎన్.కె.మధు,లోకేష్, మనోహర్,దామోదర్,ఎస్.సలీం మాలిక్, పాత్రికేయులు పాల్గొన్నారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 67933