ఆంధ్రప్రదేశ్
రైతులకు నిద్రలేకుండా చేస్తున్న ఏనుగుల మంద
చిత్తూరు జిల్లా/బంగారు పాల్యం ఏపీ టుడే న్యూస్ జనవరి 14.
చిత్తూరు జిల్లా, బంగారుపాళ్యం మండలం, బోడబండ్ల గ్రామ పంచాయతీ పరిధిలో అటవీ జంతువులు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత కొద్దిరోజులుగా పొన్నెపాలెం, లక్ష్మీపురం, సీజేఎఫ్ఎస్ కాలనీ,జంబునేరేడుపల్లి,తదితర ప్రాంతాల్లో రెండు చిరుతపులులు, ఏనుగుల సంచారం ఎక్కువగా ఉంది. 14 ఏనుగుల మంద ఒక వైపు , మదపుటేనుగు మరోవైపు, చిరుత పులులు ఆ ప్రాంత ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి.సోమవారం రాత్రి పొన్నెపాలెంలోని కోదండ యాదవ్ కు చెందిన పొలంలో మామిడి వరి కొబ్బరి అరటి ఉలవలు, పంటలను ఏనుగుల మంద తిని తొక్కి నాశనం చేశాయి.ఏనుగులు చిరుతపులుల నుంచి తమను, పంటలను రక్షించాలని పలుమార్లు అటవీశాఖ అధికారులకు చెప్పిన ప్రయోజనం లేదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని రైతు కోదండ యాదవ్ కోరారు.


-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87466