తెలంగాణ
ప్రైవేట్ రాకెట్ తయారీతెలంగాణలో ఏర్పాటు చేయడానికి Skyroot Aerospace తో ఒప్పందం

ఏపీ టుడే న్యూస్ (డిజిటల్ ప్రతినిథి) జనవరి 22
ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ యూనిట్‌ను తెలంగాణలో ఏర్పాటు చేయడానికి స్కైరూట్ ఏరోస్పేస్ (Skyroot Aerospace) కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది.
ఈ మేరకు హైదరాబాద్‌కు చెందిన అంతరిక్ష సాంకేతిక రంగంలోని కంపెనీ స్కైరూట్‌తో దావోస్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో అవగాహన ఒప్పందం (ఎంఓయు)పై సంతకాలు చేశారు.
🚀 ఒప్పందం ప్రకారం స్కైరూట్ కంపెనీ తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్ మరియు టెస్టింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తుంది. ఇందుకోసం కంపెనీ దాదాపు రూ. 500 కోట్ల పెట్టుబడి పెట్టనుంది.
🚀 ఈ ఒప్పందం పట్ల ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌కు చెందిన సంస్థ అత్యాధునిక సాంకేతిక అంతరిక్ష రంగంలో విజయం సాధించటం గర్వంగా ఉందని అన్నారు. తెలంగాణకు చెందిన యువకులు ప్రపంచంలోనే అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించటంతో పాటు, రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు వచ్చినందుకు అభినందించారు.
🚀 స్కైరూట్ కంపెనీతో ప్రభుత్వ భాగస్వామ్యం అంతరిక్ష రంగంపై తమ వ్యూహాత్మక దృష్టిని చాటిచెపుతుందని శ్రీ శ్రీధర్ బాబు అన్నారు. త్వరలోనే హైదరాబాద్ ప్రైవేట్ రంగ అంతరిక్ష కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా అభివృద్ధి చేస్తామన్నారు.
🚀 తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పెట్టుబడులు పెట్టడం సంతోషంగా ఉందని స్కై రూట్ కో-ఫౌండర్ పవన్ కుమార్ చందన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్, హైదరాబాద్ రైజింగ్ లక్ష్య సాధనలో భాగం పంచుకుంటామని చెప్పారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక