ఆంధ్రప్రదేశ్
అక్రమ మద్యం తరలింపు కేసులో కాటంశెట్టి అరెస్టు -14 రోజులు రిమాండ్
ఏపీటుడే న్యూస్ ఐ. పోలవరం మండలం (జనవరి 23):
అక్రమ మద్యం రవాణా కేసులో యానాంకు చెందిన వ్యాపారి, వైఎస్ఆర్సిపి నాయకుడు కాటంశెట్టి రామ్మూర్తి గురువారం అరెస్ట్ అయ్యారు. గడచిన ఎన్నికల్లో అక్రమ మద్యం రవాణా పై రామ్మూర్తి పై ఐ.పోలవరం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో రామ్మూర్తిని పోలీసులు అరెస్టు చేసి ముమ్మడివరం కోర్టులో హాజరు పరిచారు. న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ప్రధాన అనుచరుడైన రామ్మూర్తి ఇటీవల పొన్నాడ సతీష్ కుమార్ తో కలసి పుదుచ్చేరి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను కలిశారు. నేతలు కలిసిన మూడు రోజుల్లోనే రామూర్తిని అరెస్టు చేయడంపై తీవ్ర చర్చ జరుగుతుంది. రాజకీయ ఒత్తిల్లతోనే ఈ అరెస్టు జరిగినట్లు పలువురు చర్చించుకుంటున్నారు. ఇలా ఉండగా రామ్మూర్తిని మీడియా కంట పడకుండా స్టేషన్ నుండి ముమ్మిడివరం కోర్టుకు పోలీసులు తరలించడం విశేషం.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87464