తెలంగాణ
పరిగి శివాలయంలో ఘనంగా మహాశివరాత్రి ఉత్సవాలు

పరిగి శివాలయంలో ఘనంగా మహాశివరాత్రి ఉత్సవాలు
మహాశివరాత్రి ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా శివపార్వతుల కళ్యాణం, యజ్ఞ గుండాలలో యజ్ఞం, శివపార్వతుల కళ్యాణం తర్వాత శివపార్వతుల ఊరేగింపు అగ్గిగుండం కార్యక్రమం ఘనంగా జరిగింది
వికారాబాద్ జిల్లా/ పరిగి ( ఏపీ టుడే న్యూస్): ఫిబ్రవరి 26 :
మహాశివరాత్రి సందర్భంగా పరిగి మున్సిపల్ కేంద్రంలోని అనంత రెడ్డి కాలనీలో ఉన్న శివాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. శివాలయం ఆవరణలో బుధవారం తెల్లవారుజామున దాదాపు 5 గంటల ప్రాంతంలో అగ్నిగుండం కార్యక్రమం భక్తుల జన సందోహం మధ్యన ఘనంగా జరిగింది. పురుషులతో సమానంగా మహిళలు కూడా ఆగ్నికుండంలో పాల్గొని నిప్పుల పై నడిచారు. శివాలయం ఆవరణలో ప్రత్యేకంగా హోమ గుండాలు ఏర్పాటు చేసి అక్కడికి వచ్చిన జంటలను హోమగుండాలపై కూర్చోబెట్టి ప్రత్యేకంగా హోమం చేయించడం జరిగింది. ఉదయం 10:30 గంటల ప్రాంతంలో శివపార్వతుల కళ్యాణం వైభోపీతంగా ఘనంగా జరిగింది.
శివపార్వతుల కళ్యాణానికి కాలనీ భక్తులే కాకుండా మున్సిపల్ కేంద్రంలో ఉన్న భక్తులు భారీ సంఖ్యలో హాజరైనారు. కల్యాణోత్సవం అనంతరం సాయంత్రం శివపార్వతులను రథంపై కూర్చోబెట్టి భక్తులు ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. శివాలయం దగ్గర అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం ఉపవాస దీక్షలు విరమించుటకు భక్తులు దేవాలయ ప్రాంగణంలోకి భారీగా చేరుకున్నారు. శివాలయంలో ఉపవాస దీక్షలో ఉన్న భక్తులు జాగరణ చేయుటకు ఏర్పాట్లు కూడా దేవాలయ కమిటీ ఏర్పాటు చేసింది. వికారాబాద్ జిల్లా డీసీసీ ఉపాధ్యక్షుడు హనుమంత ముదిరాజ్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఆనంద్ గౌడ్ భక్తులతో కలిసి వచ్చి ప్రత్యేక పూజలు చేయించారు. పరిగి మాజీ జెడ్పిటిసి హరిప్రియ ప్రవీణ్ కుమార్ రెడ్డి లు శివుడికి ప్రత్యేక అభిషేకాలు అర్చనలు పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక