ఆంధ్రప్రదేశ్
మిట్స్ కళాశాల లో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం
మిట్స్ కళాశాల లో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం
సి.వి.రామన్ చిత్ర పటానికి పూలమాలలు వేసి స్మరించుకున్నా కాలేజ్ అధ్యాపకులు సిబ్బంది

అన్నమయ్య జిల్లా మదనపల్లె ఏపీ టుడే న్యూస్ ఫిబ్రవరి 28:-
కురబల కోట మండలం అంగళ్ళు వద్ద నున్న మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, మదనపల్లె నందు నేషనల్ సైన్స్ డే ను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమం లో కలశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కమల్ బాషా, భౌతిక శాస్త్ర విభాగాధిపతి డాక్టర్. చంద్రశేఖర్, బి.టెక్ ఫస్ట్ ఇయర్ కోఆర్డినేటర్ డాక్టర్ చంద్రమోహన్, యెన్.ఎస్.ఎస్ కో-ఆర్డినేటర్ రాజేష్ మరియు డాక్టర్ జగదీశ్ బాబు లు సర్ సీవి రామన్ చిత్ర పటానికి పూలమాల వేసి ఆయన ను స్మరించుకున్నారు. కార్యక్రమం లో డాక్టర్ కమల్ బాషా మాట్లాడుతూ ఈ దినము మన భారతీయ వైజ్ఞానిక ప్రతిభ ప్రపంచానికి తెలిసిన రోజు గా పరిగణిస్తామని, వైజ్ఞానిక రంగంలో నొబెల్ బహుమతి అందుకున్న దేశం మనదే అని కొనియాడారు . ప్రతిష్టాత్మకమైన దేశ పౌర పురస్కారం భారతరత్న అందుకున్న తొలి విజ్ఞాన కెరటం. ఒక్క మాటలో చెప్పాలంటే వైజ్ఞానిక శాస్త్రానికే వైద్యుడిలా మారిన వైజ్ఞానిక యోధుడు అని, ఆధునిక భారత విజ్ఞాన శాస్త్రవేత్తల పరిశోధనా ప్రతిభను అంతర్జాతీయస్థాయిలో ఇనుమడింపజేసిన వ్యక్తుల్లో సర్ సీవి రామన్ అగ్రగణ్యుడు అని అన్నారు. వైజ్ఞానిక ఆవిష్కరణల్లో భారతీయులకు నోబెల్ రావడం గగనం. అలాంటిది సర్ సీవీ రామన్ ఆ ఘనత సాధించారు.

అంతేకాదు, విజ్ఞాన శాస్త్రంలో ఆ ఘనత సాధించిన ఏకైక ఆసియా వాసిగానూ చరిత్ర సృష్టించారు అని అన్నారు. ఈ దినం మనం ఆయనను స్మరించుకోవడం మనకు ఎంతో గర్వ కారణం అన్నారు. ఏటా ఒక్కో థీమ్‌తో జాతీయ సైన్స దినోత్సవం జరుపుతుంటారు. ఈ ఏడాది ‘ప్రపంచ సంక్షేమం కోసం ప్రపంచ సైన్స్’ అనే థీమ్‌ను తీసుకున్నారు అని, ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న భారత్ పాత్రను, అంతర్జాతీయ రంగంలో పెరుగుతున్న ప్రాధాన్యతను ఇది సూచిస్తుంది అని అన్నారు. భారతీయ శాస్త్రవేత్తల ఆవిష్కరణలు, పరిశోధనలు ప్రపంచం ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలకు పరిష్కారం చూపడమే లక్ష్యంగా కోసం ఈ అంశం ఎంపిక చేశారని ఆయన అన్నారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 67875