ఆంధ్రప్రదేశ్
జామియా మసీదు ఇఫ్తార్ విందులో పాల్గొన్న భూపేష్ రెడ్డి .. -భక్తులకు బిరియాని, పండ్లు పంపిణీ (విడియో)
కడప జిల్లా/జమ్మలమడుగు ఏపీ టుడే న్యూస్ మార్చి 09:
జమ్మలమడుగు పట్టణంలోని జామియా మసీదులో ఆదివారం సాయంత్రం పవిత్ర రంజాన్ మాసం యొక్క ఉపవాస దీక్షలలో భాగంగా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో జమ్మలమడుగు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ రెడ్డి టిడిపి నాయకులు, కార్యకర్తలు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూపేష్ రెడ్డిని ఘనంగా కాశ్మీర్ శాలువా, పూలదండలతో సత్కరించారు ఈ సందర్భంగా భూపేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా రంజాన్ మాసంలో ముస్లిం సోదర సోదరీమణులు చిన్నారులు, పెద్దలు అన్న తేడా లేకుండా ఉపవాస దీక్షలు పాటిస్తారని ఇది ఎంతో గొప్ప విషయమని పేర్కొన్నారు. అనంతరం జామియా మసీదు పీఠాధిపతి సాదిక్ పాషా ఖాద్రి మాట్లాడుతూ ఎంతో నియమ నిష్టలతో పాటించే రంజాన్ పండుగ ఉపవాస దీక్షలతో తమ జీవిత కాలంలో చేసిన పాపాలు ప్రక్షాళన గావిస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా రంజాన్ పండుగ ఉపవాస దీక్ష ఆచరించిన ముస్లింసోదరులు, చిన్నారులు, పెద్దలకు అందరికీ చికెన్ బిర్యానీ, పండ్లు, చల్లటి త్రాగునీరు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గురువులు, జామియా మసీదు అభివృద్ధి కమిటీ సభ్యులు షేక్ షామీర్ భాష, ఖాదర్వల్లి, మదార్ భాష, హాఫీస్, బాబుల్ ఖాన్, కొమెర్ల శేక్షావలి,లాలు, ముస్లిం మైనారిటీ నాయకులు బేపారి మహమ్మద్ రఫీ, దలాల్ షబ్బీర్, డంకా ఎస్దాని, ముస్లిం సోదరులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.






-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 67927