ఆంధ్రప్రదేశ్
వైభవంగా జరిగిన కళాసాహితి ఉగాది సభ
ఏపీ టుడే న్యూస్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి కొత్తపేట (మార్చి 30) కళాసాహితి శ్రీ విశ్వావసు నామ ఉగాది కవి సమ్మేళనం ఈరోజు కొత్తపేట ప్రియదర్శినీ బాలవిహార్ ఆవరణలో జరిగింది. కళాసాహితి ప్రధాన కార్యదర్శి గిడ్డి సుబ్బారావు, అధ్యక్షులు పెన్మెత్స హరిహర దేవళరాజు, కార్యదర్శి యేడిద సత్తిరాజు ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు.
ఈ సభకు ముఖ్య అతిథులుగా రాజమండ్రి వాస్తవ్యులు పూర్వ 2వ తరగతి మెజిస్ట్రేట్, ప్రముఖ కవి ఎస్సార్ పృథ్వి మరియు పల్లిపాలెం వాస్తవ్యులు రిటైర్డ్ తెలుగు పండిట్, ఆంధ్రీ కుటీరం నిర్వాహకులు మధునాపంతుల సత్యనారాయణ హాజరయ్యారు.

ప్రముఖ శిల్పి రాజకుమార్ వడయార్ కవులందరినీ శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించారు. రాజమండ్రి వాస్తవ్యులు వై నాగేశ్వరరావు ప్రార్థనతో సభ మొదలయ్యింది.
నన్నయ్య విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆచార్యులు డాక్టర్ తరపట్ల సత్యనారాయణ రాసిన యజ్ఞం కవితా సంపుటిని బెంగుళూరుకు చెందిన డాక్టర్ లింగంపల్లి మునిరాజ్ కన్నడంలోకి అనువదించిన ప్రతులను కళాసాహితి ప్రధాన కార్యదర్శి గిడ్డి సుబ్బారావు వేదికపై ఆవిష్కరించారు.
అమలాపురం వాస్తవ్యులు ప్రముఖ కవి బివివి సత్యనారాయణ కవిసమ్మేళనాన్ని నిర్వహించారు. దాదాపు నలభైమంది కవులు, కవయిత్రులు ఎంతో ఉత్సాహంతో తమ కవితలు వినిపించారు.
పాల్గొన్న కవులలో అద్దేపల్లి ప్రభు, అవధానుల మణిబాబు, మోకారత్నరాజు, ఎం బాలార్జున్, నల్లా నరసింహమూర్తి, పినిపే సత్యనారాయణ, సంషోన్, వివివిఎస్ సుబ్బారావు, విత్తనాల వరప్రాసాద్, కాజా మొహియుద్దీన్, వి పద్మకుమారి, పిట్టా సుబ్రహ్మణ్యం తదితరులు ఉన్నారు.
కళాసాహితి ప్రధాన కార్యదర్శి గిడ్డి సుబ్బారావును కవులు శాలువాలతో, పూలమాలలతో సత్కరించడంతో సభ ముగిసింది.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 67918