ఆంధ్రప్రదేశ్
ప్రజలకు ఉపయోగపడే కమ్యూనిటీ హాల్ నుండి సచివాలయాలను తరలించాలి
కెవిపిఎస్ నిరసన
ఎం.సి.ఆనంద్,నగర సహాయ కార్యదర్శి
నాగేంద్రుడు
ఏపి టుడే న్యూస్ కర్నూలు బ్యూరో
కర్నూలు నగరం,కల్లూరు అర్బన్ పరిధిలోని 32వ వార్డు,ముజఫర్ నగర్ లోని నండూరి ప్రసాదరావు మెమోరియల్ కమ్యూనిటీ హాల్ నుండి సచివాలయాలను తరలించాలని కోరుతూ బుధవారం కెవిపిఎస్ అధ్యక్ష, కార్యదర్శులు ఈ.ఆంజనేయులు,సురేష్ ల ఆధ్వర్యంలో సచివాలయాల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి నగర సహాయ కార్యదర్శి ఎం.సి.ఆనంద్ హాజరై మాట్లాడారు.32వ వార్డ్,ముజఫర్ నగర్ లో పేద, మధ్యతరగతి ప్రజలు అధికంగా జీవనం సాగిస్తున్నారని అన్నారు.ఈ నేపథ్యంలో స్థానికంగా తమ కుటంబాల్లో శుభకార్యాలు జరుపుకోవడానికి నండూరి ప్రసాదరావు మెమోరియల్ కమ్యూనిటీ హాల్ అతితక్కువ ధరకు ఎంతో తక్కువ ధరలకు ఉపయోగకరంగా ఉండేదని చెప్పారు.గత ప్రభుత్వంలో మునిసిపల్ అధికారులు ప్రజలందరికీ ఉపయోగపడే నండూరి ప్రసాదరావు మెమోరియల్ కమ్యూనిటీ హాల్ ను సచివాలయాలుగా ఉపయోగించుకొని, ఆరు నెలలలో ఇతర ప్రాంతానికి తరలిస్తామని హామీ ఇచ్చి కమ్యూనిటీ హాల్ లోవార్డు సచివాలయాలను ఏర్పాటు చేశారు.గత ప్రభుత్వంలో ఏర్పాటైన ఈ సచివాలయాలు ప్రభుత్వం పీరియడ్ ముగిసి,కొత్త ప్రభుత్వం ఏర్పడి పది నెలలైనా ఇప్పటికీ సచివాలయాలను కమ్యూనిటీ హాల్ లో అలాగే కొనసాగించడం సరైందికాదన్నారు.
దీనివల్ల వార్డులో నివసించే పేదలు ఏ చిన్న శుభకార్యం జరిగినా కమ్యూనిటీ హాలు అందుబాటులో లేకపోవడం వల్ల ఇతర ఫంక్షన్ హలులకు లక్షలు ఖర్చులు పెట్టుకోలేక తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన చెందారు.ఇప్పటికైనా నగర పాలక సంస్థ అధికారులు ముజఫర్ నగర్ ప్రజల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, సచివాలయాలను కమ్యూనిటీ హాల్ నుండి ఇతర ప్రాంతానికి తరలించి ప్రజలందరికీ ఉపయోగపడేలా సహకరించాలని కోరారు.లేనిపక్షంలో స్థానిక ప్రజలను చైతన్యం చేసి ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని వారు తెలిపారు.అనంతరం సచివాలయం అడ్మిన్ లకు వినతిపత్రం అందచేశారు.ఈ కార్యక్రమంలో ఆర్.వెంకటేశ్వర్లు,బీసన్న, ఎం.శ్రావణ్ కుమార్,జె.రాజు,రవి,పెద్ద మాదన్న,అయ్యస్వామి,చిట్టిబాబు, తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 67912