ఆంధ్రప్రదేశ్
పశు వైద్యు కళాశాల ఏర్పాటు ఎంతో సంతృప్తి నిచ్చింది – ఎమ్మెల్యే వరద

లక్ష్య సాధన కోసం రాజీ లేకుండా కృషి చేయాలి – కలెక్టర్ చెరుకూరి శ్రీధర్
పశు వైద్యు కళాశాల ఏర్పాటు ఎంతో సంతృప్తి నిచ్చింది – ఎమ్మెల్యే వరద
ప్రొద్దుటూరు
విద్యార్థులు లక్ష్య సాధన కోసం రాజీ లేకుండా కృషి చేయాలని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ తెలిపారు. గురువారం మండలంలోని గోపవరం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర పశువైద్య కళాశాలలో కళాశాల డీన్ వీర బ్రహ్మయ్య అధ్యక్షతన జరిగిన కళాశాల దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి తో కలిసి పాల్గొన్నారు. ముందుగా కళాశాల అసోసియేట్ డీన్ శ్రీనివాసప్రసాద్ కళాశాల వార్షిక నివేదిక చదివి వినిపించారు. అనంతరం కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వారి హక్కుల కోసం పోరాడాలని సూచించారు. భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం, వ్యవసాయం, పశు సంవర్థక శాఖ భారత ఆర్థిక వ్యవస్థలో దాదాపు 63 శాతం వాటా కలిగివుందని వివరించారు. వ్యవసాయంలో పశు సంవర్థక శాఖ వాట అధికమన్నారు. తాను ఈ వెటర్నరీ శాఖలో భాగస్వామ్యం కావడం ఆనందకరమన్నారు. ప్రస్తుతం విద్యార్థులకు అధిక అవకాశాలు వున్నాయని, పశు వైద్యునికి చాలా గౌరవం వుందని, దేశ, విదేశాల్లో ఎన్నో ఉన్నత అవకాశాలు వున్నాయని వివరించారు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా అవకాశాలు సద్వినియోగం చేసుకొని వృద్ధి లోకి రావాలని సూచించారు. లక్ష్య సాధనలో రాజీలేని పోరాటం చేయాలని తెలిపారు. కడపలో పశు వైద్య క్లినికల్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. ఆయన పశు వైద్య విద్యార్థి గా వున్న నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అనంతరం మ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి మాట్లాడుతూ పశు వైద్యుల వృత్తి పవిత్రమైనదని తెలిపారు. శ్రీ వెంకటేశ్వర పశువైద్య కళాశాలకు ఎటువంటి మౌలిక సదుపాయాలు అవసరమైన కల్పిస్తామన్నారు. ఇక్కడ చదివిన విద్యార్థులు దేశ విదేశాల్లో స్థిరపడటం, తనను గుర్తుంచుకోవడం ఆనందకరమని తెలిపారు. నోరు లేని జీవులకు వైద్యం చేయడం చాలా పుణ్యకార్యమన్నారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వైస్ చాన్సలర్ జె.వి.రమణ ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో విద్య అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. విద్యతో పాటు క్రీడలు, యోగా, ధ్యానం పై దృష్టి సారించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో సాయిశ్రీ, పశు సంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్ శారదమ్మ, కళాశాల ఓఎస్ఓ కళ్యాణి, అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.




-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 67905