ఆంధ్రప్రదేశ్
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా

అర్ధరాత్రులు భారీ వాహనాలతో మట్టి తరలింపు
చోద్యం చూస్తున్న అధికారులు
కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం (ఏప్రిల్ 22)
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పటవల పంచాయతీలో యదేచ్చగా మట్టి అక్రమ తవ్వకాలు స్థానిక ఈ బి సి కాలనీలో సోమవారం రాత్రి రెండు జెసిబి లు డజను ట్రాక్టర్లతో, లారీలతో మట్టిని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.
గ్రామానికి చెందిన వట్టిపోతుల నాని అనే వ్యక్తి నిబంధనలకు విరుద్ధంగా చెరువు తవ్వుతూ వచ్చిన మట్టిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.
ఇంత జరుగుతున్నా స్థానిక రెవెన్యూ యంత్రాంగం మాత్రం ఆ వైపుకు చూడడం లేదు.
అధికార పార్టీ అండదండలు భారీగా నగదు చేతులు మారడంతో రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అదేవిధంగా స్థానిక జాతీయ రహదారి చెంతన పీచు ఫ్యాక్టరీ సరిహద్దులు గత వారం రోజులుగా అక్రమంగా పూడ్చి పెడుతున్నప్పటికీ అధికారులు పట్టించుకునే దాఖలాలు లేవు. పలువురు స్థానిక వీఆర్వోకు ఫిర్యాదు చేసినప్పటికీ నిర్లక్ష్యంగా మాట్లాడడం ఆరోపణలను నిజం చేస్తుంది.
రాత్రి వేళల్లో ఇష్టానుసారంగా భారీ లోడులతో మట్టి లారీలను తోలడంతో, దుమ్ము ధూళి లేచిపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామీణ రహదారులలో సాయంత్రం వేళల్లో చిన్నపిల్లలు ఆటలు ఆడుకుంటూ ఉంటారని మట్టి ట్రాక్టర్లు వేగంగా వెళ్లడంతో ఏ సమయంలో ఏ ప్రమాదం జరుగుతుందోనని గ్రామస్తులు బెంబేలు ఎత్తిపోతున్నారు. ఇకనైనా జిల్లా స్పందించి మట్టి అక్రమ రవాణాను నిలుపు చేయాలని మామూళ్ల మత్తులో జోగుతున్న అధికారులను నియంత్రించాలని కోరుతున్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక
-
ఆంధ్రప్రదేశ్2 months ago
స్పందన సుబ్బరామిరెడ్డి ఇకలేరు…