ఆంధ్రప్రదేశ్
రాహుల్ గాంధీ ఒక వ్యక్తి కాదు మహా శక్తి – ఇర్ఫాన్ బాషా

దేశం అంత రాహుల్ గాంధీ వైపు చూస్తుంది – ప్రొద్దుటూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్
రాహుల్ గాంధీ ఒక వ్యక్తి కాదు మహా శక్తి
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
నిన్నటి రోజు మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాహుల్ గాంధీ మీద చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు ప్రొద్దుటూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఇర్ఫాన్ బాషా. ముఖ్యమంత్రిగా పని చేసిన వారు రాజకీయ సంప్రదాయాలు తెలిసిన వారు ఇలా మాట్లాడడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు?
మాణికం టాగోర్ ని వాడు వీడు అని సంబోధించడం ఎంత వరకు సబబు. ఆయన ఒక పార్లమెంట్ సభ్యుడు. ఇలా సంబోధించడం మీ విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. వోట్ చోరీ ను నిరసిస్తూ పార్లమెంటు ఆవరణలో అన్ని పార్టీలకు చెందిన ఎంపీ లు నిరసన తెలియ చేస్తుంటే వైకాపా ఎంపీలు ఎందుకు పాల్గొదెనలేదని ప్రశ్నించారు ఇర్ఫాన్ బాషా.
తమ వైఖరేంటో ప్రజలకు స్పష్టత ఇవ్వాలని కోరారు.. 2029లో ఎవరికి మద్దతిస్తారో ప్రధాన మంత్రిగా ఎవరికి చూడాలని అనుకుంటున్నారో ప్రజలకు తెలియచేయాలన్నారు. ఈ రోజుకు కూడా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కట్టుబడి ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కావాలో లేకుంటే మూడో సారి అధికారంలో వచ్చి కూడా ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీ కావాలో ప్రజలకు తెలియచేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకు ఎవరు ముందుకు వస్తే వారికీ మద్దతు ఇస్తామని జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలు గుర్తు చేసారు. 2029 లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు అనేక రకాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ చేస్తుందని తెలియచేసారు ఇర్ఫాన్ బాషా.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 87372