భక్తి
తిరుమలలో దళారుల ఏరివేతకు చర్యలు తీసుకోండి – టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు
*తిరుమల, 2024 జులై 03: తిరుమల శ్రీవారి భక్తులను మోసగిస్తున్న దళారులను కనిపెట్టి ఎప్పటికప్పుడు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు జిల్లా ఎస్పీని కోరారు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో బుధవారం ఉదయం జిల్లా పోలీస్, టీటీడీ నిఘా మరియు భద్రత విభాగం అధికారులతో ఈవో సమావేశం నిర్వహించారు.*
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే వేలాది మంది భక్తులకు అవసరమైన వసతి, దర్శనం, ఆర్ధితసేవ టికెట్లకు సంబంధించి భక్తులను మోసగిస్తున్న అనేకమంది దళారులను ఉపేక్షించరాదన్నారు. వారిపై వెంట వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
సివిఎస్ఓ వివరించిన ఆవశ్యకత మేరకు తిరుమలలో ఐటి అనుబంధంగా ఉన్న కేసులను సత్వరం పరిష్కరించేందుకు సైబర్ క్రైమ్ టీం ఏర్పాటు పరిశీలించవలసిందిగా సంబంధిత అధికారులకు ఈవో సూచించారు.
అంతకుముందు పోలీస్ విభాగం వారు తిరుమలలో దర్శన దళారులకు సంబంధించి, ఆన్లైన్ ద్వారా, డిప్ సిస్టం ద్వారా, రిజిస్ట్రేషన్ చేసుకున్న కేసులు, దొంగతనం కేసులు, మధ్యపానం, నకిలీ వెబ్సైట్లు, తదితర అంశాలకు సంబంధించిన కేసులు ఏఏ దశల్లో ఉన్నాయో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం ఈవో మాట్లాడుతూ మరో వారంలోపు ఈ కేసుల్లో ఉన్న దళారులకు చట్టపరంగా తగు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ అధికారులను కోరారు. అంతేకాకుండా ఇటువంటి కేసుల సత్వర పరిష్కారం కోసం టీటీడీ విజిలెన్స్, పోలీస్ విభాగాలు తరచూ సమావేశం కావాలన్నారు.
ఈ సమావేశంలో తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, టీటీడీ జేఈవోలు శ్రీమతి గౌతమి, శ్రీ వీరబ్రహ్మం, సివి అండ్ ఎస్ఓ శ్రీ నరసింహ కిషోర్, తిరుమల అదనపు ఎస్పీ శ్రీమతి విమల కుమారి, డిఎస్పి శ్రీ శ్రీనివాస ఆచారి, టీటీడీ విజివో (విజిలెన్స్) శ్రీ గిరిధర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
J Anilkumar
Tirumala
Correspondent
AP TODAY NEWS
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87477