ఆంధ్రప్రదేశ్
విద్య, మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి, గారికి ఉమ్మడి కర్నూలు జిల్లా సమస్యలను వివరించిన TNSF రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డిపోగు బజారన్న
కర్నూలు:
ఈరోజు విద్య, మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్న గారిని ఉండవెల్లి వారి స్వగృహం లో మర్యాద పూర్వకంగా కలిసిన TNSF రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డిపోగు బజారన్నమరియు TNSF నంద్యాల పార్లమెంటు అధికార ప్రతినిధి జలీల్ భాష కలిశారు
ఈ సందర్భంగా వారు విద్యార్థుల మరియు ప్రజాసమస్యలను వారి దృష్టికి వివరించడం జరిగింది. జిల్లాలోని ప్రైవేట్ విద్య సంస్థలు అధిక ఫీజులు విద్యార్థుల దగ్గర నుండి వసూలు చేస్తున్నాయి వాటిని నివారించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని అధిక ఫీజులు వసూలు చేసే విద్య సంస్థల గుర్తింపు నీ రద్దు చెయ్యాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. అదే విధంగా ఉమ్మడి జిల్లాలో పాణ్యం నియోజకవర్గం లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నీ మరియు ఆదోని నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నీ ఏర్పాటు చేయాలని కోరారు. కర్నూలు జిల్లాలో త్రాగునీటి సమస్యను, సాగునీటి సమస్య ఉన్నందున శాశ్వతంగా పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకొనవలసిందిగా వారి ధృష్టికి వివరించడం జరిగింది. జిల్లాలోని తెలుగుదేశంపార్టీకి సంభందించిన సంస్థాగత విషయాలపైన, పార్టీ కి కష్టకాలం లో అండగా ఉండి ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో పార్టీ విజయానికి కృషి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనీ ప్రోత్సాహించాలని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్న గారికి వివరించడం జరిగింది.
-
జాతీయం2 years agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్2 years agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్2 years agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్2 years agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్2 years agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక




Total Users : 136510