ఆంధ్రప్రదేశ్
నిత్యావసర సరుకుల ధరలు సామాన్యులకు అందుబాటులో ఉంచటమే లక్ష్యం…
రిపోర్టర్: జైదేవ్
అంబెడ్కర్ కోనసీమ జిల్లా
కొత్తపేట నియోజకవర్గం
కొత్తపేట మండలం
*రైతుబజారులో తక్కువ ధరలకు బియ్యం,కందిపప్పు విక్రయ ప్రారంభ కార్యక్రమంలో శాసనసభ్యులు సత్యానందరావు…*

పేదల పక్షాన నిలబడి ప్రజా పాలన అందించేదే తెలుగుదేశం,జనసేన,భాజపా కూటమి ప్రభుత్వం అని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు అన్నారు.కొత్తపేట, రావులపాలెం రైతు మార్కెట్ లలో తక్కువ ధరకి బియ్యం కందిపప్పు విక్రయించే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం హయాంలో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటి పేదలు ఇబ్బందులు పడినా పట్టించుకునే నాథుడే లోకపోయారని గుర్తుచేశారు.ఆ ఇబ్బందులను తొలగించుకునేందుకే చరిత్రలో లేని విధంగా కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించారని తెలిపారు.వారి ఆశాలకు అనుగుణంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని అందులో భాగంగానే నిత్యావసర సరుకులైన బియ్యం,కందిపప్పు తక్కువ ధరలకు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు.అందరికీ అందుబాటులో ఉండేలా నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం కందిపప్పు కిలో బయట మార్కెట్లో 181 రూపాయి ఉంటే 160 రూపాయలకే అందేలా అలానే 52.40 రూపాయలు ఉండే 48 రూపాయలకు,55.85 రూపాయలు ఉండే స్టీమ్డ్ బియ్యాన్ని 49 రూపాయలకే అందించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.రానున్న రోజుల్లో మరిన్ని ధరలు తగ్గించి పేదల పక్షాన నిలబడే ప్రభుత్వంగా చాటుకుంటామని సత్యానందరావు తెలిపారు.ఈ కార్యక్రమం లొ బూసి జయలక్ష్మి భాస్కరరావు,ఆకుల రామకృష్ణ,కంఠంశెట్టి శ్రీనివాస్, చిలువురి సతీష్ రాజు, గుత్తుల పట్టాభి రామయ్య, ధరణాల రామకృష్ణ మరియు కుట్టమి నాయకులు, కార్యక్తలు పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 87463