ఆంధ్రప్రదేశ్
కాలనీని అభివృద్ధికి చెయ్యి చెయ్యి కలిపిన శ్రీరామ కాలనీ యువకులు
రిపోర్టర్: జైదేవ్
అంబెడ్కర్ కోనసీమ జిల్లా
కొత్తపేట నియోజకవర్గం
ఆలమూరు మండలం
ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎదురు చూడకుండా చేయి చేయి కలిపి ఒకటై తమ కాలనీని అభివృద్ధి చేసుకొని అధికారులకు, ప్రజాప్రతినిధులకు సవాల్ విసిరారు. వివరాల్లోకి వెళితే కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం మడికి శివారు మల్లావానితోట శ్రీరామ కాలనీలో సుమారు వంద గృహాలు ఉండగా 500 మంది జనాభా నివసిస్తున్నారు. ఈ కాలనీ ఏర్పడి దాదాపు 30 ఏళ్లు గడుస్తున్నా సర్కారీ వారి దృష్టిలో ఈ కాలనీ ఎప్పుడు శివారే… ఇప్పటివరకు ఒక్క డ్రైన్ గాని సిసి రోడ్డు గాని వేసిన దాఖలాలు లేవు.ఈ కాలనీలో అంతా బీసీలే అధికం. రోడ్డుకు ఇరువైపులా పిచ్చి మొక్కలు మొలిసి కనీసం వర్షపు నీరు బయటకు పోయేందుకు కూడా వీలు లేకపోవడంతో కాలనీలోని యువకులు అంతా ఒక్కటై వారే స్వచ్ఛందంగా కాలనీలో విరాళాలు సేకరించి జెసిబి సహాయంతో రోడ్లను శుభ్రం చేసుకున్నారు. కాలనీ ప్రజల ఆరోగ్యం కోరకు పంచాయితీ నిధులు కోసం ఎదురు చూడకుండా తామే వీధులను శుభ్ర పరుచుకున్నారు
గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే ప్రజా ప్రతినిధులకు వీరు ఆదర్శంగా నిలిచారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87230