ఆంధ్రప్రదేశ్
నదులను అనుసంధానించి రాష్ట్రంలో కరవు లేకుండా చేస్తాం: సీఎం చంద్రబాబు
*అనకాపల్లి*
*భగవంతుడు ఇచ్చిన శక్తితో ప్రజల రుణం తీర్చుకుంటానని సీఎం చంద్రబాబు అన్నారు.*
*ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా అనకాపల్లి జిల్లాలోని పోలవరం ఎడమ కాలువను ఆయన పరిశీలించారు.*
*నదులు అనుసంధానించి రాష్ట్రంలో కరవు లేకుండా చేస్తామన్నారు.*
*ఈ క్రమంలో చంద్రబాబుకు ఉత్తరాంధ్ర ప్రజలు ఘనస్వాగతం పలికారు.*
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేస్తే ప్రతి ఎకరాకు నీరందుతుందని ఆ దిశగా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. నదులు అనుసంధానించి రాష్ట్రంలో కరవు లేకుండా చేస్తామన్నారు. భగవంతుడు ఇచ్చిన శక్తితో ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు తొలిసారి ఉత్తరాంధ్రలో పర్యటించగా ప్రజలు ఘన స్వాగతం పలికారు.
అనకాపల్లి జిల్లా దార్లపూడిలో వద్ద ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం పోలవరం ఎడమ కాల్వను పరిశీలించారు. గోదావరి జలాలు అనకాపల్లి జిల్లాకు రావాలని సీఎం అన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తిచేస్తే అనకాపల్లిలో 2.8 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని టెండర్లు పిలిచి వీలైనంత తొందరగా ప్రాజెక్టు పూర్తిచేస్తామని భరోసా ఇచ్చారు. అనకాపల్లి జిల్లాలోని 3 చక్కెర కర్మాగారాలు పడకేసే పరిస్థితికి తెచ్చారని వాటిని పునరుద్ధరిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.
*విశాఖను దోచుకున్నారు:* వైఎస్సార్సీపీ విధ్వంసకర పాలనతో రాష్ట్రం మొత్తం గుంతలమయంగా మారిందని ప్రజల బతుకులు ఆగమయ్యాయాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు విశాఖను దోచుకున్నారని వారిమీద తప్పకుండా చర్యలు ఉంటాయని అన్నారు. అరాచకాలు చేసిన వ్యక్తిని ప్రజా కోర్టులో శిక్షించారని చెప్పారు. ప్రజలు గెలిచారని రాష్ట్రం నిలదొక్కుకునేందుకు బాధ్యతగా పని చేస్తామని హామీ ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై వైఎస్సార్సీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు తాను అంగీకరించినట్లు విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. విషప్రచారాలు నమ్మొద్దని స్టీల్ ప్లాంట్ పరిరక్షణ బాధ్యత తనదని భరోసా ఇచ్చారు.
*పోలవరాన్ని గోదావరిలో కలిపేశారు:* వాజ్పేయి ప్రభుత్వంలో టీడీపీ స్టీల్ ప్లాంట్ను కాపాడిందని, ఇప్పుడు మళ్లీ కాపాడుతుందని అన్నారు. పోలవరం ఎడమ కాలువ ఐదేళ్ల క్రితం ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉందని చంద్రబాబు అన్నారు. పోలవరం ఎడమ కాలువ 214 కిలోమీటర్లు రావాలని అన్నారు. పోలవరం డయ ఫ్రమ్ వాల్ను గోదావరిలో కలిపేశారనీ మండిపడ్డారు. పోలవరం రాష్ట్రానికి ఒక వరం అని కొనియాడారు. పోలవరం ద్వారా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేసుకుంటే ప్రతి ఎకరానికి నీళ్లు అందిచవచ్చని సీఎం చంద్రబాబు తెలిపారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87464