Uncategorized
గోదావరి జిల్లాల్లో పులస చేపల సందడి
పులసల సందడి ఈ చేప లో ఏముందో ఏమో కాని విశేషం 24 వేల రూపాయల లు పలికిన కేజిన్నర చేప!
ఎర్రనీరు వస్తుండడంతో పులస చేపల రాక మొదలు
కోనమసీమ జాలరికి చిక్కిన పులస
రూ. 24 వేలకు కొనుగోలు చేసిన మాజీ సర్పంచ్
వానాకాలం వచ్చిందంటే చాలు గోదావరి జిల్లాల్లో సరికొత్త సందడి మొదలవుతుంది. పులస చేపల కోసం వేట మొదలవుతుంది.
ఒక్క చేప అయినా వలలో పడితే ఇక పండుగే. వేల రూపాయల ధర పలికే ఈ చేపకు ఇంత భారీ ధర పలకడానికి కారణం దాని రుచే. గోదావరికి ఎదురు ఈదుతూ వచ్చే ఈ చేపను జీవితంలో ఒక్కసారైనా తినాలని అనుకోని వారుండరు. ‘పుస్తెలు అమ్మి అయినా పులస తినాలి’ అన్న సామెత ఎలానూ ఉంది.
తాజాగా గోదావరికి ఎర్రనీరు వస్తుండడంతో ఓ జాలరి వలలో పులస చిక్కింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వశిష్ట గోదావరిలో మకిలిపురం మండలం రామరాజులంక జాలర్ల వలలో దాదాపు కేజిన్నర బరువున్న పులస చేప పడింది. ఆ వెంటనే దానిని మాజీ సర్పంచ్ బర్రే శ్రీను రూ. 24 వేలకు కొనుగోలు చేసి తీసుకెళ్లారు. పులస చేపా.. మజాకా!
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87436