ఆంధ్రప్రదేశ్
మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశం
అమరావతి
అధికారంలోకి వచ్చేశాం అనే అలసత్వం వీడాలని పార్టీ నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. మంత్రులూ పార్టీ కార్యాలయానికి తరచూ రావటం సేవగా భావించాలన్నారు. రోజూ ఇద్దరు మంత్రులైనా వచ్చి కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఎన్టీఆర్ భవన్లో ముఖ్యనేతలతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. మంత్రుల్ని పార్టీ కార్యాలయానికి తీసుకొచ్చే బాధ్యత జోనల్ ఇంఛార్జిలు తీసుకోవాలని తెలిపారు. ప్రజలు, కార్యకర్తల నుంచి వచ్చే వినతుల్ని స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు మంత్రులంతా బాధ్యత తీసుకోవాలన్నారు.
కార్యకర్తలు, ప్రజల నుంచి వినతులు, విజ్ఞాపనల స్వీకరణకు ఒక ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఇందుకోసం ఓ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తానని వెల్లడించారు. పార్టీ నేతలు ఎవ్వరూ వ్యక్తిగత దాడులకు, కక్షసాధింపులకు దిగొద్దన్న చంద్రబాబు వైఎస్సార్సీపీ చేసిన తప్పులే తిరిగి మనం చేస్తే వారికీ మనకూ తేడా ఉండదని చంద్రబాబు పేర్కొన్నారు. తప్పు చేసిన వారిని చట్టపరంగానే శిక్షిద్దామన్నారు. గత ఐదు ఏళ్లుగా పార్టీ కార్యకర్తలపై నమోదైన అక్రమ కేసులను చంద్రబాబు ఆరా తీశారు. చట్టపరంగానే కేసుల నుంచి విముక్తి కలిగించాలనే విషయంపై చంద్రబాబు నేతలతో చర్చించారు.
*పార్టీ కోసం కష్టపడిన వారి సమాచార సేకరణ:*
నియోజకవర్గ ఇంఛార్జిలు తమ పరిధిలో నమోదైన అక్రమ కేసుల వివరాలను పంపాలని సీఎం కోరారు. తెలుగుదేశం నేతలు, ఇళ్లు, కార్యాలయాలపై గతంలో వైఎస్సార్సీపీ మూకలు దాడులకు దిగినప్పుడు కేసులు పెట్టినా సక్రమంగా వ్యవహరించని అధికారుల వివరాలూ ఇవ్వాలని ఆదేశించారు. సమర్థులందరికీ నామినేటడ్ పదవులు దక్కుతాయన్న చంద్రబాబు పార్టీ కోసం కష్టపడిన వారి గురించి 5 విధాలుగా సమాచార సేకరణ చేస్తున్నామన్నారు. నివేదికలు త్వరగా పంపాలని నేతలను ఆదేశించారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87436