ఆంధ్రప్రదేశ్
బాలుడి లివర్ ట్రాన్స్పరెన్సీ కోసం కొత్తపేట యువ శెట్టి బలిజ 50 వేల రూ. ఆర్థిక సాయం

రిపోర్టర్: జైదేవ్
అంబెడ్కర్ కోనసీమ జిల్లా
కొత్తపేట నియోజకవర్గం
కొత్తపేట మండలం
రావులపాలెం మండల వెదిరేశ్వరం, మూలగూడెం గ్రామానికి చెందిన ఇళ్ల వెంకటేశ్వరావు,నాగలక్ష్మి దంపతులకు జన్మించిన ఇళ్ల అఖిల్ అనే నాలుగు నెలలు బాలుడికి లివర్ వ్యాధి వల్ల తీవ్ర అనారోగ్యానికి గురై హైదరాబాద్ పీస్ హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్నాడు.గత కొద్దిరోజులు నుండి వైద్యం అందిస్తున్న బాలుడు పరిస్థితి విషమంగానే ఉండటంతో వైద్యులు సూచన మేరకు బాలుడికి లివర్ ట్రాన్స్పరెన్సీ చెయ్యాలని తెలియజేసారు.
లివర్ ట్రాన్స్పరెన్సీ కోసం కనీసం 20 నుండి 25 లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు తెలియజేసారు. ఇప్పటికే ఉన్నదంతా బాలుడు వైద్యం కోసం ఖర్చు చేసిన కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని తెలుసుకున్న కొత్తపేట మండల యువ శెట్టి బలిజ సంఘ సభ్యులు బాలుడు ఆర్యోగ్య పరిస్థితి గూర్చి తెలుసుకుని బాలుడి వైద్య చికిత్సకు 50 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు.
ఈ కార్యక్రమంలో కొత్తపేట మండల యువ శెట్టి బలిజ సంఘం అధ్యక్షుడు బొక్కా ప్రసాద్, గౌరవ అధ్యక్షులు యనమదల శ్రీనివాస్, సెక్రటరీ శీలం కొండబాబు,ఆర్గనైజింగ్ సెక్రటరీ ముషిణి వెంకట రమణ,జాయింట్ సెక్రటరీ కడలి భీమా, ట్రెజరరీ మామిడి శెట్టి బాలాజీ, బొక్కా పళ్ళంశెట్టి,చిట్టురి శ్రీను, వాసంశెట్టి శ్రీనివాస్, కముజు శ్రీను, కేత సతీష్ తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం7 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక