ఆంధ్రప్రదేశ్
ఆఫర్లతో ఆకట్టుకుంటున్న బిఎస్ఎన్ఎల్
వరుస ఆఫర్లతో బిఎస్ఎన్ఎల్ ఆకట్టుకుంటుంది 2,399 రూపాయలతో 395 రోజుల వ్యాలిడిటీతో ఆఫర్ ప్రకటించిన ప్రభుత్వరంగ టెలికం కంపెనీ 4జీ స్పీడ్‌తో రోజుకు 2 జీబీ డేటాతో పాటు రోమింగ్ కూడా ఉచితం త్వరలోనే దేశవ్యాప్తంగా 4జీ నెట్ వర్క్‌ను ప్రారంభించబోతున్న బీఎస్ఎన్ఎల్ ఈ మేరకు నెట్‌వర్క్ అప్‌గ్రేడ్‌కు సంబంధించిన పనులను కంపెనీ చక్కబెడుతోంది. అయితే 4జీ సేవల ప్రారంభానికి ముందే అదిరిపోయే ఆఫర్‌ను బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. 12 నెలల వ్యాలిడిటీతో (395 రోజులు) తీసుకొచ్చిన ఈ ప్లాన్ ధర రూ. 2,399గా ఉంది. నెలకు రూ.200 కంటే తక్కువే పడుతున్న ఈ ఆఫర్‌లో రోజుకు 2జీబీ హై-స్పీడ్ డేటా లభిస్తుంది. ఇక రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు, దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాలింగ్, ఉచిత రోమింగ్, ఇంకా అనేక విలువ ఆధారిత సేవలను యూజర్లు పొందవచ్చు.
*365 రోజుల ప్లాన్ ప్రయోజనాలు ఇవే*
ఒక ఏడాది ప్లాన్లలో భాగంగా 365 రోజుల ప్లాన్‌ను కూడా బీఎస్ఎన్‌ఎల్ రోజువారీ పరిమితి లేకుండా మొత్తం 600జీబీల డేటాను కంపెనీ అందిస్తోంది. ప్రతిరోజూ 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు, దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు.
బీఎస్‌ఎన్ఎల్ వైపు చూస్తున్న కస్టమర్లు..ఇటీవల ఇతర నెట్ వర్క్ లు రేట్లు పెరిగిన నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ ప్లాన్ల వైపు కస్టమర్లు చూస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో కస్టమర్లను ఆకర్షించుకోవడమే లక్ష్యంగా మెరుగైన సేవలతో ఆకర్షణీయమైన ఆఫర్లు అందించేందుకు బీఎస్ఎన్ఎల్ సమాయత్తమవడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87462