Connect with us

ఆంధ్రప్రదేశ్

తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారికి టీటీడీ సారె

Published

on

*తిరుమల, 2024 జూలై 29:
తిరుత్తణి శ్రీ వళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామివారికి తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి తరపున పట్టు వస్త్రాలను టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు సోమవారం సమర్పించారు. టీటీడీ అధికారులకు తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి ఆలయ చైర్మన్‌ శ్రీ శ్రీధర్, జైంట్ కమిషనర్ శ్రీ అరుణాచలం, తిరుత్తణి ఆలయ బోర్డు సభ్యులు, ఇతర అధికారులు ఘనస్వాగతం పలికి పట్టు వస్త్రాలను స్వామివారికి అలంకరించారు.*

*ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ భారతదేశంలోనే ప్రసిద్ది గాంచిన శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రాలలో తిరుత్తణి అత్యంత ప్రముఖమైనది. టీటీడీ 2006 నుండి ఆడికృతికను పురస్కరించుకుని శ్రీ సుబ్రమణ్యస్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించడం ఆచారంగా వస్తున్నదని చెప్పారు. స్వామివారి అనుగ్రహంతో ప్రజలు అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు.*

*ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, పారుపత్తేదార్ శ్రీ తులసి ప్రసాద్, వేద పరాయణతలు ఉన్నారు.*

*చారిత్రక ప్రాశస్త్యం:*

*తిరుపతి పుణ్యక్షేత్రం నుండి సుమారు 50 కి.మీ. దూరంలో తమిళనాడు రాష్ట్రంలో వెలసివున్న ఈ దివ్యక్షేత్రం తమిళులు అత్యంత భక్తి పూర్వకంగా స్తుతించే ”ఆరుపడైవీడు” లో ఒక్కటి. సురపద్ముడనే అసురుని సంహరించి శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఇక్కడ తన ఉభయదేవేరులైన శ్రీవళ్ళీ, దేవయాని అమ్మవార్ల సమేతంగా తనికేశన్‌గా వెలసి భక్తులచే పూజలు అందుకుంటున్నాయి.*

*ఈ క్షేత్ర ప్రాశస్త్యంలో మరొక ముఖ్యమైన చారిత్రక నేపధ్యానికి వస్తే ఇక్కడ వెలసి వున్న పుష్కరిణిలో (నంది నది) సర్పరాజు వాసుకి స్నానం ఆచరించి సముద్ర మధనం సమయంలో మందర పర్వతానికి తనను తాడుగా ఉపయోగించి దేవాసురులు అమృతం కోసం చిలుకుతున్నప్పుడు ఏర్పడిన గాయాల నుండి ఉపశమనం పొందాడు. ఈ ఆలయంలో నిర్వహించే అనేక ఉత్సవాలలో ఆడికృత్తిక అత్యంత ప్రసిద్ధమైనది. ఈ సందర్భంగా భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూలతో అలంకరించిన కావడు ఎత్తుకు వెళ్లి మొక్కుబడులు చెల్లించడం విశేషం.*

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580177
Total Users : 47861