ఆంధ్రప్రదేశ్
భక్తులు లేక ఖాళీగా ఉన్న పుష్కరిణి
*మొదలైన శ్రీవారి పుష్కరిణి* *మరమ్మతు పనులు*
తిరుమల :తిరుమల శ్రీవారి పుష్కరిణి మరమ్మతు పనులు గురువారం నుంచి మొదలయ్యాయి. సాధారణంగా ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాలకు ముందు పుష్కరిణిలోని మరమ్మతులను పూర్తి చేసి నీటిని నింపడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా గురువారం నుంచి ఈనెల 31వ తేదీ వరకు పుష్కరిణిని మూసివేసి మరమ్మతులు చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఈక్రమంలో గురువారం భక్తుల అనుమతిని రద్దు చేసి ప్రస్తుతం ఉన్న నీటిని తోడే పనులను మొదలుపెట్టారు. తొలి పదిరోజులు నీటిని తొలగిస్తారు. తర్వాత పదిరోజులు మరమ్మతులేవైనా ఉంటే గుర్తించి పూర్తి చేస్తారు. చివరి పదిరోజుల్లో తిరిగి నీటిని నింపుతారు. సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి పుష్కరిణిని భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తారు. కాగా, ప్రస్తుతం భక్తులకు ఇబ్బంది లేకుండా పుష్కరిణి వెనుకభాగంలో ప్రత్యామ్నాయంగా నీటి కొళాయిలను ఏర్పాటు చేశారు. భక్తుల అనుమతిని రద్దు చేయడంతో నిత్యం కిటకిటలాడే పుష్కరిణి గురువారం బోసిపోయింది.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87443