ఆంధ్రప్రదేశ్
స్కూల్ బస్సు బోల్తా.. విద్యార్థిని మృతి

అన్నమయ్య జిల్లా
అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె సమీపంలో ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థిని అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఓబులవారిపల్లె నుంచి సమీపంలోని శ్రీవాణి ప్రైవేటు పాఠశాలకు 20 మంది విద్యార్థులతో బస్సు బయలుదేరింది. ఓబులవారిపల్లె దాటిన తర్వాత ఓ చిన్న వంతెన వద్ద వెనక టైరు పొరపాటున రాయి ఎక్కడంతో బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న రెండో తరగతి విద్యార్థిని భవిష్య (8) మృతిచెందింది.
చిన్న వారం పాడు వద్ద, ప్రైవేట్ పాఠశాల, వ్యాను బోల్తా పడి, ఒక విద్యార్థి మృతి చెందడం, అనేక మంది విద్యార్థులకు గాయాలకు అవడం బాధాకరమని, తక్షణం ఆ పాఠశాల యాజమాన్యంపై, విచారించి చర్యలు తీసుకోవాలని అన్నమయ్య జిల్లా,సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్ ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. వాహనాలు కండిషన్ లో లేకపోవడం, బ్రేక్ ఇన్స్పెక్టర్, ప్రైవేటు విద్యాసంస్థల వద్ద మామూలు తీసుకొని, ఎఫ్సీలు ఇచ్చేస్తున్నారని, తెలిపారు. ఆ విద్యాసంస్థ యాజమాన్యంపై వెంటనే చర్య తీసుకోవాలన్నారు. కోడూరు నియోజకవర్గంలో, ప్రైవేటు విద్యాసంస్థలు వాహనాల భద్రతా చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు అన్నారు. ఎంఈఓ, డీఈవోలు, బ్రేక్ ఇన్స్పెక్టర్లు, మామూళ్లు మత్తులో, విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
అన్ని విద్యాసంస్థల, వాహనాలను పరిశీలించాలని, అధిక సంఖ్యలో పిల్లలను రవాణా చేయడం ఆపాలని, చట్ట వ్యతిరేకంగా బాధ్యతారహితంగా పనిచేస్తున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాలిక కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక